
గోసంరక్షణనిధి పథకానికి రూ.లక్ష విరాళం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న గోసంరక్షణ నిధి పథకానికి శుక్రవారం నెల్లూరుకు చెందిన ఉప్పలపాటి నందీశ్వర రాయల్ రూ.1,00,116 విరాళాన్ని పర్యవేక్షకురాలు టీ.హిమబిందుకు అందజేశారు. విరాళాన్ని అందించిన దాతకు దేవస్థానం తరుఫున స్వామివారి శేషవస్త్రాన్ని, లడ్డూప్రసాదాలను, జ్ఞాపికను అందించి సత్కరించారు.
అరుణాచల క్షేత్రానికి 10న ప్రత్యేక బస్సు
కర్నూలు కల్చరల్: భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ రోడ్డు రవాణా సంస్థ కర్నూలు – 2 డిపో నుంచి తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచల క్షేత్ర దర్శ నం, గిరి ప్రదక్షణకు సూపర్ లగ్జరీ బస్సు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ కేఎల్‌కే శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తేదీ ఉదయం 7 గంటలకు బయలు దేరి మార్గమధ్యలో కా ణికపాకం దర్శించుకొని అదే రోజు రాత్రి 8 గంటలకు అరుణాచలం చేరుకుంటుందని తెలిపారు. గిరి ప్రదక్షి ణ, అరుణాచలేశ్వర స్వామి దర్శనం ఉంటుంద ని పేర్కొన్నారు. 11వ తేదీ సాయంత్రం 4 గంటలకు బయలు దేరి వేలూరు గోల్డెన్ టెంపుల్ అమ్మవారిని దర్శించుకొని 12వ తేదీ శనివారం ఉదయం 6 గంటలకు కర్నూలు చేరుకుంటుందని తెలిపారు. సూపర్ లగ్జరీ బస్సులో రానుపోను రూ. 2000 ఛార్జీగా నిర్ణయించడం జరిగిందని పే ర్కొన్నారు. మరిన్ని వివరాలకు ట్రాఫిక్ అసిస్టెంట్ మేనేజర్ నం. 73828 71131, డిపో మేనేజర్ 9959225794 సంప్రదించాలని విజ్ఙప్తి చేశారు.
పోతుగల్లులో వ్యక్తి అదృశ్యం
కృష్ణగిరి: మండల పరిధి లోని పోతుగల్లు గ్రామాని కి చెందిన బోయ రాము డు అదృశ్యమయ్యాడు. గత నెల 26న ఉదయం బహిర్భూమికి అని వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు తెలిసిన చోటల్లా గాలించినా ఫలితం లేకపోయింది. శుక్రవారం బాధితుడి భా ర్య బోయ రంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి గాలింపు చేపట్టినట్లు ఎస్‌ఐ కృష్ణమూర్తి తెలిపారు. ఇతనికి 15 ఏళ్ల క్రితం పెళ్లి అయిందని కానీ పిల్లలు కాలేదన్నారు. ఇటీవల కాలంలో రాముడు అన్నకు బ్లడ్ క్యాన్సర్ రావడంతో సదురు విషయం గురించి బాధపడుతూ ఉండేవాడని బాధితుడి భార్య ఫిర్యాదులో పేర్కొంది.
ఇద్దరు దొంగల అరెస్ట్
బనగానపల్లె రూరల్: స్థానిక కొండపేటలో గత నెలలో చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగలను అరెస్టు చేసినట్లు బనగానపల్లె అర్బన్ సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీసు స్టేషన్‌లో నిందితుల వివరాలను వెల్లడించారు. వైఎస్సార్ కడప జిల్లా ఖాజీపేట మండలం తుడుములదిన్నె గ్రామానికి చెందిన కూకట్‌పల్లి భరత్‌కుమార్, అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని మారుతీ నగర్‌కు చెందిన వనార్చి మహేష్ పలు చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఈ క్రమంలో కొండపేటలో గత నెల 1వ తేదీన కాటసాని బలరామిరెడ్డి ఇంట్లో రూ.7.50 లక్షల విలువైన ఆభరణాలు అపహరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి సాంకేతిక పరిజ్ఞానంతో ఆచూకీ గుర్తించి శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇద్దరు నిందితుల నుంచి ఏడు తులాల బంగారు ఆభరణాలు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో తమ ప్రతిభను చూపించిన పోలీసులు సుబ్బరామకృష్ణ, నాగన్న, ప్రదీప్‌లను జిల్లా ఎస్పీ అభినందించినట్లు సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐ దుగ్గిరెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

గోసంరక్షణనిధి పథకానికి రూ.లక్ష విరాళం

గోసంరక్షణనిధి పథకానికి రూ.లక్ష విరాళం