
ఉరుకుందలో 25 నుంచి శ్రావణ ఉత్సవాలు
కౌతాళం: ఉరుకుంద ఈరన్నస్వామి ఆలయంలో ఈనెల 25 నుంచి ఆగస్టు 23వ తేదీ వరకు శ్రావణమాస ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ విజయరాజు తెలిపారు. గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్సవాలకు హాజరయ్యే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. దేవాలయం లోపలి భాగంలో ఫిల్టర్ తాగునీటి కుళాయిలను ఏర్పాటు చేశామన్నారు. భక్తుల విడిది కోసం 168 గదులు ఉన్నాయన్నారు. భక్తులకు ఎక్కడా బురద అంటకుండా దేవాలయం చుట్టూ సీసీ ఫెవర్స్ పరుస్తున్నామన్నారు. ఆలయ ఉత్తరం ద్వారం వద్ద వీఐపీ లాంచ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అంతరాలయం దర్శనం కోసం రూ.వెయ్యి టిక్కెట్ పెడుతున్నట్లు చెప్పారు.. అలాగే స్లాట్ దర్శనం కూడ ఏర్పాటు చేస్తామన్నారు. అన్నదాన సత్రంలోనే కాక మరో రెండు చోట్ల భోజన వసతి ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మహిళల కోసం ప్రత్యేంగా మరుగుదొడ్లను నిర్మించినట్లు తెలిపారు. సమావేశంలో అర్చకులు శివన్నస్వామి, నాగరాజ్‌స్వామి, ఆలయ పర్యవేక్షకులు వెంకటేష్, మల్లికార్జున, ఇన్‌స్పెక్టర్ వీరేష్, సిబ్బంది కుమార్, కిరణ్ పలువురు పాల్గొన్నారు.
ఆగస్టు 23 వరకు నిర్వహణ
భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తాం
ఆలయ డిప్యూటీ కమిషనర్
విజయరాజు