
ఏడాది పాలనకే ప్రజలు విసుగెత్తిపోయారు
పాణ్యం: ఏడాది కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు విసిగెత్తిపోయారని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. గురువారం పాణ్యం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలు మొత్తం అమలు చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఆక్రమణలు, అక్రమార్జనే ధ్యేయంగా పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. హామీలు అమలు చేయకపోగా.. తొలి అడుగు అంటూ ఊర్లకు వస్తున్న ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారన్నారు. గొప్పగా రూ. 4 వేలు పింఛన్ ఇచ్చామని చెప్పి మరో వైపు 3 లక్షల పింఛన్లు కోత పెట్టడం చంద్రబాబుకు చెల్లిందన్నారు. తల్లికి వందనం అందక రోజూ ప్రజలు కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నారన్నారు. బాబూ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ‘బాబూ ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ కార్యక్రమం చేపట్టామన్నారు. ‘ప్రభుత్వం తొలి అడుగు’ పేరుతో ఇంటింటికీ వచ్చే ఎమ్మెల్యేలు, మంత్రులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల బాండ్లను చూపి నిలదీయాలన్నారు. గత ప్రభుత్వం వేసిన శిలాఫలకాలకు రంగులు మార్చి అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నామని హడావుడి చేస్తున్నారన్నారు.
శ్రీశైలానికి వరద వచ్చినా
పోతిరెడ్డిపాడు గేట్లు ఎందుకు
ఎత్తడం లేదు
వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు
ఎమ్మెల్యే కాటసాని