
పాము కరవగానే ఇలా చేయాలి
● పాము కరవగానే భయాందోళనకు గురిగాకుండా ధైర్యంగా ఉండాలి. బంధుమిత్రులు కూడా వారికి ధైర్యం చెప్పాలి.
● ఆ పాము విష సర్పమో కాదో గుర్తించే ప్రయత్నం చేయాలి. దానివల్ల చికిత్స మరింత కచ్చితంగా అందించవచ్చు.
● నాటు వైద్యం, మంత్రతంత్రాల జోలికి
వెళ్లకుండా సాధ్యమైనంత తొందరగా
దగ్గరలోని ఆసుపత్రికి రోగిని నడిపించకుండా
తీసుకెళ్లాలి.
ఇలా చేయకూడదు
● పాముకాటు వేయగానే కొందరు ఆ గాయాన్ని మరింతగా కోస్తే రక్తంతోపాటు విషం వచ్చేస్తుందని కత్తితో, బ్లేడుతో గాటు పెడతారు. అలా చేయడం వల్ల ఒక్కోసారి పాముకాటు కన్నా ఈ గాయం ప్రమాదకరంగా మారవచ్చు. శాసీ్త్రయమైన చికిత్స సాధ్యమైనంత త్వరగా అందించడమే ఉత్తమం.
● మరికొందరు పాము కరిచిన ప్రదేశంలో గాటుపెట్టి నోటితో విషం పీల్చేస్తుంటారు. పాముకాటు వేయగానే విషం రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు, గుండెకు చేరుకుంటుంది. కాబట్టి దీనివల్ల ప్రయోజనం ఉండదు. ఒక్కోసారి హాని కలగవచ్చు కూడా.
● అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పాముకాటుకు ఉచిత చికిత్స లభిస్తుంది. వైద్యునికి రోగి గురించి సమాచారాన్ని ముందే అందజేస్తే త్వరగా మెరుగైన చికిత్స అందజేసే వీలుంది.