
ముగిసిన వజ్రోత్సవ వేడుకలు
కోవెలకుంట్ల: పట్టణంలో వెలసిన వాసవీ కన్యకాపరమేశ్వరీదేవి ఆలయంలో జరుగుతున్న వజ్రోత్సవ వేడుకలు గురువారం ముగిశాయి. చివరి రోజు హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి తీర్థ మహాస్వామి ఆధ్వర్యంలో పూర్ణాహుతి, మహా కుంభాభిషేకం, తదితర కార్యక్రమాలు చేపట్టారు. అంతక ముందు వేద పండితులు అమ్మవారికి ప్రాత:కాల పూజ, శ్రీచక్ర నవావరణార్చన, చతుషష్టికళార్చన, ప్రాణప్రతిష్ట, జపానుష్టానములు, దుర్గాసప్తశతీ పారాయణం, రుద్రపారాయణం, సుందరకాండ, భగవద్గీత, భారత సంపూర్ణ రామాయణం, రుద్రాభిషేకం, చండీ, రుద్ర, రాజశ్యామల హోమాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పుష్పాలంకరలో వాసవీమాత గ్రామోత్సవం కనులవిందుగా సాగింది.