
రాజ గోపురం నిర్మాణానికి రూ.13 లక్షలు విరాళం
నందవరం: పూలచింత గ్రామంలో వెలసిన శ్రీ బండేగురుడి మఠం రాజ గోపురం నిర్మాణానికి భక్తులు విరాళం అందించారు. మంగళవారం గ్రామంలో గ్రామ సర్పంచ్ అక్కమహాదేవి ఆధ్వర్యంలో మఠం ఉప పీఠాధిపతి బండేప్ప స్వామికి గ్రామ పెద్దలు, గ్రామస్తులు రూ.13 లక్షలు విరాళం అందజేశారు. గ్రామస్తులు మ ఠం అభివృద్ధికి, గోపురం నిర్మాణానికి తమ సహాయంగా విరాళం అందించారు. ఈ సందర్భంగా ఉప పీఠాధిపతి మాట్లాడుతూ.. పీఠాధి పతి జయ శంకర స్వామి ఆశీస్సులతో మఠాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. గ్రామస్తు లు, భక్తులు ఇచ్చిన విరాళంతో రాజ గోపుర నిర్మాణం త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు.
పురాతన బావుల సమాచారం ఇవ్వండి
నంద్యాల(వ్యవసాయం): జిల్లాలోని పురాతన కాలంనాటి పాడుబడిన కోనేరులు, మెట్ల, దిగుడు బావుల సమాచారం ఇవ్వాలని ఇన్ టచ్ నంద్యాల చాప్టర్, మన ఊరు–మన గుడి, మన బాధ్యత గౌరవ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి మంగళవారం తెలిపారు. జిల్లాలోని పురాతన కాలం నాటి దిగుడు బావులు, కోనేరులు ఉంటే ఆ ఊరి ప్రజలతో తమ సంస్థ సభ్యులు కలసి వాటిని ఉపయోగంలోకి తెచ్చేలా కృషి చేస్తామన్నారు. కోనేరులు, బావుల్లో ఉన్నటువంటి వివరాలు తెలిపే శాసనాలు తదితర ఉంటే 8919547562కు ఫొటోలతో సహా పంపినట్లయితే వాటిని పునరుద్ధరించి సమష్టి కృషి చేస్తామని తెలిపారు.
ఆవుల మందపై
మళ్లీ పెద్ద పులి దాడి
వెలుగోడు: తెలుగు గంగ ప్రాజెక్టులో భాగమైన మద్రాస్ కాల్వ వద్ద పంట పొలాల్లో ఆవుల మందపై పెద్దపులి మళ్లీ దాడి చేసింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం దాడి చేసి పులి ఒక ఆవును చంపిన విషయం విదితమే. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 20 రోజుల ఆవు దూడను చంపేసిందని అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. పెద్దపులి వరుస దాడులతో రైతులు, ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పెద్ద పులి నుంచి ఆవులను కాపాడి నష్టపరిహారం చెల్లించాలని రైతు సేవా నాయక్ అటవీ అధికారులను కోరారు.