సన్న బియ్యం.. పెద్ద దందా! | - | Sakshi
Sakshi News home page

సన్న బియ్యం.. పెద్ద దందా!

May 17 2025 6:36 AM | Updated on May 17 2025 6:36 AM

సన్న

సన్న బియ్యం.. పెద్ద దందా!

కౌటాల మాజీ సర్పంచ్‌ వొజ్జల మౌనిశ్‌ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 13.40 క్వింటాళ్ల రేషన్‌ సన్నబియ్యాన్ని ఈ నెల 4న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పట్టుకున్నారు. బియ్యం విక్రయించిన షేక్‌ జైనొద్దీన్‌, పెరుగు ప్రభాకర్‌, పోతులవార్‌ తిరుపతి, గుర్లె విట్టుమేర, విలాస్‌, మనోహర్‌, కొనుగోలు చేసిన మాజీ సర్పంచ్‌ వొజ్జల మౌనిశ్‌పై 6ఏ కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఎక్కువ మొత్తంలో సన్నబియ్యం పట్టుకున్నా తక్కువ బియ్యం పట్టుకున్నట్లు చూపించారనే ఆరోపణ లున్నాయి. ఈ కేసు నమోదు అనంతరం ఎ న్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు, నిందితులిచ్చిన విందులో పాల్గొన్నట్లు సమాచారం.

కౌటాల: పేదలకు నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న ప్ర భుత్వం ఆ బియ్యం పక్కదారి పడుతుంటే ఏమీ చేయలేకపోతోంది. చాలామంది అనర్హుల కూ రే షన్‌ కార్డులుండడం, మరికొందరికి రేషన్‌ బి య్యం తినడం ఇష్టం లేక అమ్ముకుంటున్నారు. జి ల్లాలో 314 రేషన్‌ షాపులుండగా, 1.41 లక్షల ఆహార భద్రత కార్డులున్నాయి. వీరికి ప్రతీ నెల మూడువేల మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. అంత్యోదయ లబ్ధిదారులకు 35 కిలో లు, అన్నపూర్ణ అబ్ధిదారులకు 10 కిలోల చొప్పున ప్రభుత్వం సరఫరా చేస్తోంది.

పగలు కొని రాత్రుల్లో విక్రయం

కొందరు రేషన్‌ డీలర్లు ‘డబ్బులు కావాలా.. బి య్యం కావాలా’ అని నేరుగా లబ్ధిదారులను అడుగుతుండడం గమనార్హం. కొందరు అక్రమార్కులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కిలో రూ.25 ఇస్తామని చెబుతున్నారు. చిరు వ్యాపారులు, దళారులు గ్రా మాల్లో తిరుగుతూ, రేషన్‌ షాపుల వద్ద పగలు ల బ్ధిదారులు, రేషన్‌ డీలర్ల నుంచి రూ.23 చొప్పున కొనుగోలు చేసి రాత్రుల్లో ప్రత్యేక వాహనాల్లో త రలించి మిల్లర్లు, బియ్యం వ్యాపారులకు రూ.28 కి అమ్ముతున్నారు. అవి మళ్లీ మెరుగులు దిద్దుకు ని ఎక్కువ ధరకు వినియోగదారుల వంట గదికి చేరుతున్నాయి. కొందరు మిల్లర్లు ప్రతీనెల అధి కారులకు మామూళ్లు ఇస్తూ అక్రమ దందా నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ప్ర భుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యాన్ని లబ్ధిదా రులు విక్రయిస్తే అధికారులు వారి ఆహార భద్రత కార్డులు తొలగించనున్నారు.

ఇటీవల బియ్యం పట్టుకున్న ఘటనలు

● జిల్లా కేంద్రంలోని బజార్‌వాడిలో వ్యాపారి మ ధుసూదన్‌ ఇంట్లో ఈ నెల 3న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు 2.79 క్వింటాళ్ల సన్నబియ్యం పట్టుకుని ఇద్దరిపై 6ఏ కేసు నమోదు చేశారు.

● కౌటాల మాజీ సర్పంచ్‌ వొజ్జల మౌనిశ్‌ ఇంట్లో నిల్వ ఉన్న 13.40 క్వింటాళ్ల సన్న బియ్యాన్ని అధికారులు పట్టుకుని, అమ్మిన ఆరుగురు, కొన్న మౌనిశ్‌పై కేసు నమోదు చేశారు.

● వాంకిడి మండలం బోర్డా గ్రామంలో ఓ ఇంట్లో నిల్వ ఉంచిన మూడు క్వింటాళ్ల సన్న బి య్యాన్ని ఈ నెల 6న అధికారులు పట్టుకుని ముగ్గురిపై కేసు నమోదు చేశారు.

● ఈ నెల 8న సిర్పూర్‌(టి) మండలం డోర్పల్లికి చెందిన అనురాధ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన ఆరున్నర క్వింటాళ్ల బియ్యాన్ని పోలీసులు పట్టుకుని ఆమైపె కేసు నమోదు చేశారు.

● సిర్పూర్‌(టి) మండలం పారిగాం సమీపంలో ఈనెల 8న దిచక్రవాహనాలపై తరలిస్తున్న నా లుగు క్వింటాళ్ల సన్నబియ్యాన్ని అధికారులు పట్టుకుని ముగ్గురిపై కేసు నమోదు చేశారు.

రేషన్‌ దుకాణాలు : 314

అంత్యోదయ కార్డులు : 12,948

తెల్లరేషన్‌ కార్డులు : 1.40లక్షలు

నెల బియ్యం కోటా : 3వేల

మెట్రిక్‌ టన్నులు

జిల్లాలో ప్రజాపంపిణీ వివరాలు

విక్రయిస్తున్న రేషన్‌ లబ్ధిదారులు

కొత్త దందాకు దిగిన దళారులు

పోలీసులకు పట్టుబడుతున్న వైనం

కేసులు నమోదు చేస్తాం

రేషన్‌ బియ్యం అక్రమంగా తరలించే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం. అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టాం. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న సన్న బియ్యాన్ని దుర్వినియోగం చేయొద్దు. సన్నబియ్యం విక్రయించే వారి సమాచారం తెలుపాలి.

– శ్రీనివాస్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ

సన్న బియ్యం.. పెద్ద దందా!1
1/1

సన్న బియ్యం.. పెద్ద దందా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement