లింగమూర్తి సేవలు మరువలేనివి..
ఖమ్మంమామిళ్లగూడెం: ఆర్టీసీ ఉద్యోగిగా పలు హోదాల్లో పనిచేసిన గడ్డం లింగమూర్తి సేవలు మరువలేనివని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివారం ఖమ్మం ముస్తఫారగర్‌లోని లింగమూర్తి స్వగృహం వద్ద స్టాఫ్, వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు వీరాంజనేయులు అధ్యక్షతన లింగమూర్తి ఉద్యోగ విరమణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లింగమూర్తి, కౌసల్య దంపతులను సత్కరించారు. తూములూరి వెంకటేశ్వరరావు, కల్యాణం వెంకటేశ్వరరావు, వజ్రాల శ్రీనివాసరావు, పిల్లి రమేశ్, ఎ.కృష్ణ, జె.పద్మావతి, బాణాల రాంబాబు, మాధవరావు, సుధాకర్, ఎంఆర్.నాథ్, నామా వీరభద్రం, వై.విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.


