పీడిస్తున్న మహమ్మారి..
జిల్లాలో గత ఐదేళ్లుగా
నమోదైన కేసులు
జిల్లాలో 17,743
ఎయిడ్స్ కేసులు నమోదు
ఈ ఏడాది ఇప్పటివరకు 258
మందికి పాజిటివ్
ఎయిడ్స్ నియంత్రణకు కృషి
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలో ఎయిడ్స్ మహ మ్మారి కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితాలు కానరావడం లేదని తెలుస్తోంది. వ్యాధి బారిన పడేవారి సంఖ్య ఎక్కు వ అవుతుందే తప్ప తగ్గడం లేదు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ చర్య లు నామమాత్రంగా ఉండటం.. ఎయిడ్స్ అండ్ లెప్రసీ విభాగానికి ప్రత్యేక అధికారి లేకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొన్నట్లు విమర్శలు వస్తున్నాయి. మరోపక్క స్వచ్ఛంద సంస్థల బాధ్యులు కూడా ఈ అంశంపై కార్యాచరణ రూపొందించకపోవడం, ఎయిడ్స్‌వ్యాధి వ్యాప్తి, నష్టాలపై ప్రచారం సక్రమంగా నిర్వహించే వారు లేక వ్యాధికి అడ్డుకట్ట పడడం లేదు. జిల్లాలో ప్రతీనెల 50కి పైగా హెచ్‌ఐవీ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఎయిడ్స్ మహమ్మారిని తరిమికొట్టేలా ప్రజలకు అవ గాహన కల్పించేందుకు ఏటా జరుపుకునే ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం నేడు (సోమవారం) జరగనున్న సందర్భంగా కథనం.
కేసులు ౖపైపెకి
జిల్లాలో ఎయిడ్స్ బాధితులు ఏటా పెరుగుతున్నా రు. గత ఏడాది అక్టోబర్ వరకు 17,199 పాజిటివ్ కేసులను అధికారికంగా గుర్తించారు. స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఏర్పడ్డాక ఇప్పటి వరకు నమోదైన కేసులు ఇవి కాగా.. ఏటేటా మరిన్ని పెరుగుతున్నా యి. ప్రస్తుతం కేసుల సంఖ్య 17,743కు చేరింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 53,691మంది పరీక్షలు చేయగా 258 కొత్త పాజిటివ్ కేసులను గుర్తించారు. ఇందు లో 11మంది గర్భిణులు కూడా ఉన్నారు. కాగా, ఇప్పటి వరకు జిల్లా జనరల్ ఆస్పత్రిలోని ఏఆర్‌టీ కేంద్రంలో 7,112 మంది ఎయిడ్స్ బాధితులు పేర్లు నమోదు చేసుకు ని ప్రతీనెల క్రమం తప్పకుండా మందులు వాడుతున్నారు. వారిలో 3,415 మందికి ఆసరా పింఛన్ కూడా అందుతోంది.
4,680 మందిని బలిగొన్న మహమ్మారి
జిల్లాలో ఎయిడ్స్ బారిన పడి మృతి చెందుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. జిల్లాలో 2006 నుంచి ఇప్పటి వర కు 4,680 మంది ఎయిడ్స్ కారణంగా మృతి చెందారు. అయితే, ఇవి ప్రభుత్వ పరంగా నమోదైన కేసులు మాత్రమే. నమోదు కాని కేసుల సంఖ్య, మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండొచ్చని భావిస్తున్నారు. జిల్లాలో నాలుగు ఐసీటీసీ, ఒక సుఖ వ్యాధి చికిత్స, 38 ఎఫ్‌ఐసీటీసీ, ఒక ఏఆర్‌టీ, రెండు లింక్ ఏఆర్‌టీ కేంద్రాలు, 11 రక్త నిధి కేంద్రాలు హెచ్‌ఐవీ నియంత్రణకు పనిచేస్తున్నా ఆశించిన ఫలితం ఉండడం లేదు. ఎయిడ్స్ నియంత్రణకు పనిచేస్తున్న పలు స్వచ్ఛంద సంస్థలకు రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నుంచి నిధులు భారీగానే అందుతున్నాయి. కానీ, ప్రజల్లో అవగాహన కల్పించడంలో చొరవ చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణ కూడా లేకుండా పోయింది. ఎయిడ్స్ నియంత్రణకు పాటు పడాల్సిన జిల్లా అధికారి పోస్టు చాలాకాలంగా ఖాళీగానే ఉంటోంది. దీంతో ఎయిడ్స్ విభాగాన్ని ముందుకు నడిపేవారు లేక మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది.
ఏడాది కేసులు చేసిన పరీక్షలు
2021–22 445 47,714
2022–23 512 86,120
2023–24 559 1,18,796
2024–25 567 1,10,056
2025–26 258 53,691
(అక్టోబర్ వరకు)
నేడు ప్రపంచ ఎయిడ్స్
నివారణ దినోత్సవం
జిల్లాలో ఎయిడ్స్ కట్టడికి కృషి చేస్తున్నాం. వ్యాధి వ్యాప్తిని అరికట్టేలా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. బాధితులందరూ క్రమం తప్పక మందు లు వాడేలా పర్యవేక్షిస్తున్నాం. ర్యాలీలు, కళాజాత ద్వారా ఎయిడ్స్ వ్యాధి తీవ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తుండగా.. ఈ కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తాం. – డి.రామారావు, డీఎంహెచ్‌ఓ
పీడిస్తున్న మహమ్మారి..


