హోరాహోరీగా అథ్లెటిక్స్ పోటీలు
ఖమ్మంస్పోట్స్: జిల్లాస్థాయి ఖేలో ఇండియా ఆధ్వర్యాన బాలికల విభాగంలో నిర్వహించిన అస్మిత అథ్లెటిక్స్ పోటీలు ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం హోరాహోరీగా సాగాయి. ఈ పోటీలను ఖమ్మం రైల్వే సీఐ అంజలి ప్రారంభించారు. యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ రవికుమార్, డాక్టర్ సత్యనారాయణ, అథ్లెటిక్స్ కోచ్ ఎండీ గౌస్, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎండీ షఫిక్‌తో పాటు ఎం.సుధాకర్, డి.రవి, సీహెచ్ కృష్ణయ్య, ఎన్.వెంకటేశ్వర్లు, ఎల్.రవి, జి.ముజాహిద్, అజ్రాఫాతిమా తదితరులు పాల్గొన్నారు.
విజేతలు వీరే..
అండర్–14 బాలికల ట్రయథిలిన్ ఈవెంట్ గ్రూప్–ఏలో ఎండీ ఆఫ్రిన్, కె.సంజన, ఎస్‌కే హాసిని, సీహెచ్ స్వర్ణపుష్ప, గ్రూప్–బీ విభాగంలో బి.శ్రీలేఖ, ఎం.బిందు, ఆర్.గీతయామిని, గ్రూప్–సీలో ఎస్‌కే సనీయా, బి.నిఖిత, ఎస్.హర్షిత, పి.సోనఖాన్ వరుస స్థానాల్లో నిలిచారు. అండర్–16 60 మీటర్ల పరుగులో ఎ.మనుశ్రీ, ఎస్.సల్మామెహతాబ్, బి.పూజిత, బి.సంగీత, 600 మీటర్ల పరుగులో బి.దీక్ష, బి.సంగీత, ఎస్‌కే సల్మామెహతా, లాంగ్‌జంప్‌లో ఎ.మనుశ్రీ, బి.కావేరి, జి.మంజుషా, ఎస్‌డీ బాషారా, హైజంప్‌లో బి.మైథిలి, ఎస్.సమీరా, ఎ.ఇందిర, షాట్‌ఫుట్‌లో డి.పావని, బి.అఖిల, సీహెచ్.సుకీర్తి, ఈ.రమ్యశ్రీ, డిస్కస్‌త్రోలో డి.పావని, పి.తనుశ్రీ, బి.అఖిల, పి.కీర్తి, జావెలీన్‌త్రోలో ఎల్.అమ్ములు, పి.తనుశ్రీ, ఎస్.సాయివర్షిత విజేతలుగా నిలవడంతో పతకాలు అందజేశారు.


