● ముద్దాయిపై ఇప్పటికే ఏపీలో పలు కేసులు ● వివరాలు వెల్లడించిన ఇల్లెందు డీఎస్పీ | - | Sakshi
Sakshi News home page

● ముద్దాయిపై ఇప్పటికే ఏపీలో పలు కేసులు ● వివరాలు వెల్లడించిన ఇల్లెందు డీఎస్పీ

Dec 1 2025 9:36 AM | Updated on Dec 1 2025 9:36 AM

● ముద

● ముద్దాయిపై ఇప్పటికే ఏపీలో పలు కేసులు ● వివరాలు వెల్ల

● ముద్దాయిపై ఇప్పటికే ఏపీలో పలు కేసులు ● వివరాలు వెల్లడించిన ఇల్లెందు డీఎస్పీ

రోడ్డు ప్రమాదంలో లారీడ్రైవర్‌ మృతి

తల్లాడ: తల్లాడలోని కొత్తగూడెం రోడ్డులో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీడ్రైవర్‌ పెద్ది సురేశ్‌ (30) మృతి చెందాడు. ఖమ్మం నుంచి కొత్తగూడె రోడ్డు వైపు వెళ్తున్న లారీడ్రైవర్‌ వేబ్రిడ్జి వద్ద లారీని ఆపి రోడ్డుపై నిల్చున్నాడు. తల్లాడ నుంచి అన్నారుగూడెం వైపు అతివేగంగా మోటార్‌ సైకిల్‌ నడుపుతున్న వ్యక్తి సురేశ్‌ను ఢీకొట్టాడు. తీవ్ర గాయాలపాలైన సురేశ్‌ను ఓ ప్రేవేట్‌ ఆస్పత్రిలో చేర్పించగా ఆదివారం తెల్లవారుజామున మరణించాడు. లారీడ్రైవర్‌ది ఖమ్మం సమీపంలోని వైఎస్‌ఆర్‌కాలనీ. రెండో ఎస్‌ఐ వెంకటేశ్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ఆలయంలో హుండీ చోరీ

కల్లూరురూరల్‌: కల్లూరులోని పుల్లయ్యబంజర్‌ రోడ్డులో గల సమ్మక్క, సారలమ్మ ఆలయంలో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హుండీపగల గొట్టి డబ్బులు చోరీ చేశారు. ఈ హుండీలో 3 నెలల నుంచి నగదును తీయకుండా ఉంచా మని ఆలయ పూజారి అంజి స్వామి తెలిపారు. ఆదివారం ఉదయం చూడగా హుండీ పగలగొట్టి ఉన్నదని, హుండీలో ఉన్న నగదును దొంగలు అపహరించినట్లు గుర్తించామని, స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని అంజిస్వామి వెల్లడించారు.

రూ.99.83 లక్షల విలువైన

గంజాయి పట్టివేత

టేకులపల్లి : అక్రమంగా తరలిస్తున్న 199.673 కేజీల గంజాయిని టేకులపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు ఇల్లెందు డీఎస్పీ ఎన్‌ చంద్రభాను ఆదివారం వివరాలు వెల్లడించారు. రాజస్థాన్‌కు చెందిన లాల్‌సింగ్‌ చౌహాన్‌ అలియాస్‌ లాక్‌సింగ్‌ 30 ఏళ్లుగా ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా జీ మాడుగుల గ్రామంలో స్వీట్‌ షాప్‌ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో గంజాయి అక్రమ రవాణాకు అలవాటుపడ్డాడు. ఈ క్రమంలో ఏఓబీ(ఆంధ్ర ఒడిశా బోర్డర్‌) నుంచి రాజస్థాన్‌కు ఏపీ31 డీఏ 4554 నంబర్‌ గల మారుతీ సియాజ్‌ కారులో 199.673 కేజీల గంజాయిని 100 ప్యాకెట్లుగా చేసి తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు టేకులపల్లి మండలం సాయనపేట వద్ద ఎస్‌ఐ ఎ. రాజేందర్‌ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేశారు. కాగా, పోలీసులను తప్పించబోయిన ముద్దాయి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టి దొరికిపోయాడు. కారులో గంజాయిని గుర్తించిన పోలీసులు వాహనంతో పాటు రెండు మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకుని ముద్దాయిని రిమాండ్‌ నిమిత్తం ఇల్లెందుకు కోర్టుకు తరలించారు. కాగా, లాల్‌సింగ్‌పై ఏపీలో ఇప్పటికే అనేక కేసులు నమోదయ్యాయని తెలిపారు. అతడి తల్లి కన్కార్‌ దేవి, భార్య మాఫీ కన్వర్‌ కూడా గంజాయి తరలిస్తూ పట్టుబడగా ఏపీలోని ఎస్‌.రామవరం పోలీసులు అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు తరలించారని, లాల్‌సింగ్‌ సోదరుడు వీర్‌సింగ్‌ రాజస్థాన్‌ జైలులో ఉన్నాడని వివరించారు. సమావేశంలో సీఐ బత్తుల సత్యనారాయణ, బోడు ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

● ముద్దాయిపై  ఇప్పటికే ఏపీలో పలు కేసులు ● వివరాలు వెల్ల1
1/2

● ముద్దాయిపై ఇప్పటికే ఏపీలో పలు కేసులు ● వివరాలు వెల్ల

● ముద్దాయిపై  ఇప్పటికే ఏపీలో పలు కేసులు ● వివరాలు వెల్ల2
2/2

● ముద్దాయిపై ఇప్పటికే ఏపీలో పలు కేసులు ● వివరాలు వెల్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement