‘మేమెంతో.. మాకంత’
ఖమ్మంమామిళ్లగూడెం: మేమెంతో మాకు అంత రిజర్వేషన్ కావాలని జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహరాజ్, తెలంగాణ ఉద్యమకారుడు విఠల్ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ఓ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన జిల్లా బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆవిర్భావ సభలో వారు పాల్గొని మాట్లాడారు. అగ్రకుల ఆధిపత్యంతోనే నక్సలిజం పుట్టిందని, అందుకే మనకు రాజ్యాంగ ఫలాలు అందలేదని పేర్కొన్నారు. ఓసీల్లో పేదరికం 4 శాతం ఉంటే 10 శాతం రిజర్వేషన్ ఇచ్చారని, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ద్వారా రాజకీయ స్వరూపాన్ని మార్చాలని పిలుపునిచ్చారు. సుంకర శ్రీనివాస్, సంగమేశ్వర్, తాటి వెంకటేశ్వర్లు, సంపత్, బండి నాగేశ్వరరావు, శివన్, ముత్యాలరావు, రాంబాబు, విజయకుమారి, మేకల సుగుణారావు, బానోతు భద్రునాయక్, సోమ్లానాయక్ తదితరులు పాల్గొన్నారు.
సమాజం మద్దతు పొందాలి..
టీఎస్‌యూటీఎఫ్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్
కల్లూరురూరల్: ఉపాధ్యాయులు సమాజం మద్దతు పొందాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్ కోరారు. కల్లూరు లో ఆదివారం సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్కే రంజాన్ అధ్యక్షతన జిల్లాస్థాయి సమావేశం నిర్వహించగా.. ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామస్తుల సహకారంతో ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఉపాధ్యాయు లు కృషిచేయాలన్నారు. పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు ఎందుకు పంపిస్తున్నారో గ్రహించాలని, ఉపాధ్యాయులు ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉంటే పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు పంపిస్తారని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే రాగమయి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాశాఖకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సంఘం బాధ్యులు రాయల నాగేశ్వరరావు, విజయ్‌కుమార్, బాగం నీరజాదేవి, పారుపల్లి నాగేశ్వరరావు, నాగమల్లేశ్వరరావు, నెల్లూరు వీరబాబు, చావా దుర్గభవాని, బాణోతు రాందాస్ పాల్గొన్నారు.
రెండోస్థానంలో
సింగరేణి జట్టు
రుద్రంపూర్: కోలిండియాస్థాయి కబడ్డీ పోటీల్లో వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ జట్టు విజేతగా నిలిచింది. సింగరేణి జట్టు రెండోస్థానం పొందింది. సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని ప్రొఫెసర్ జయశంకర్ గ్రౌండ్స్‌లో మూడు రోజులుగా జరుగుతున్న కబడ్డీ పోటీలు ఆదివారం ముగిశాయి. ఫైనల్స్‌లో సింగరేణి జట్టుపై వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ జట్టు 44 పాయింట్ల అధిక్యతతో విజయం సాధించింది. కోలిండియా ట్రోఫీని సొంతం చేసుకుంది. ఆతిథ్య సింగరేణి జట్టు రెండో స్థానంలో నిలిచింది. విజేతలకు సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ బొగ్గు ఉత్పత్తి సంస్థల కార్మికులు కబడ్డీ పోటీల్లో ప్రతిభ చాటారని అన్నారు. ఆటల్లో గెలుపు ఓటమిలు సహజమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్ సూర్యనారాయణ, జీఎం శాలేంరాజు, గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రాతినిధ్య సంఘం నాయకులు త్యాగరాజన్, సీఎంఓఏఐ ఈబీసీ నాయకులు బి. రాజ్‌గోపాల్, నరసింహారావు, జీఎంలు కిరణ్‌కుమార్, ఎం.సుబ్బారావు, కోటిరెడ్డి, సూర్యనారాయణ రాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
‘మేమెంతో.. మాకంత’
‘మేమెంతో.. మాకంత’


