
అధ్వానంగా కార్యాలయ ఆవరణ
సాక్షి,బళ్లారి: కన్నడ భాష పరిరక్షణకు నగరంలోని అనంతపురం రోడ్డు(రాజ్‌కుమార్‌రోడ్డు)లో ఏర్పాటు చేసిన కన్నడ సంస్కృతిశాఖ కార్యాలయ ఆవరణ అధ్వానంగా తయారైంది. జిల్లాధికారి బంగ్లా పక్కానే ఉన్న ఈ కార్యాలయంలో పరిసరాల్లో చెత్తా చెదారం చేరిది. ఇక్కడ జిల్లా కేంద్ర గ్రంథాలయం ఉండటంతో వందలాది మంది విద్యార్థులు, నగర వాసులు వచ్చి జ్ఞానార్జన పొందుతుంటారు. ఇదే ఆవరణలో నగరవాసులు ఏదయం, సాయంత్రం వాకింగ్‌కు వస్తుంటారు. స్వచ్ఛత కరువు కావడంతో వ్యాహాళికి వచ్చినవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో వైపు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఇదే కార్యాలయ ఆవరణలో అధునాతన భవనాలు నిర్మించారు. వాటిని వినియోగించకుండా వృథాగా వదిలేశారు అక్కడి సమస్యలను అధికారులు దృష్టికి తీసుకెళ్లినా పట్టించకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. మంచినీటి సంపు క్లీన్ చేయకపోవడంతో అందులో చెత్తాచెదారం పడిపోయింది. మరుగుదొడ్లు కూడా దుస్థితికి చేరి దుర్వాసన వెదజల్లుతున్నాయని వ్యాహాళికి వచ్చినవారు వాపోతున్నారు. కన్నడ సంస్కృతి శాఖ కార్యాలయ ఆవరణంలో సమస్యలపై సామాజిక కార్యకర్త వెంటకరెడ్డి మాట్లాడుతూ కన్నడ సంస్కృతిశాఖ కార్యాలయ ఆవరణంలో నెలకొన్న దుస్థితికి అధికారికి చెబితే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం సంబంధిత అధికారులు స్పందించి సమస్యలు తీర్చాలని సూచించారు.
వృథాగా భవనాలు
ఆవరణలో పారిశుధ్య లోపం
వ్యాహాళికి వస్తే కంపు, దుర్వాసన స్వాగతం
పట్టించుకోని అధికారులు

అధ్వానంగా కార్యాలయ ఆవరణ

అధ్వానంగా కార్యాలయ ఆవరణ