కరీంనగర్ ఫిలిగ్రీకి ప్రధాని మోదీ ప్రశంస
కరీంనగర్: ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ 128వ ఎపిసోడ్‌లో కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీని ప్రశంసించారు. కరీంనగర్‌కు ప్రత్యేకమైన వెండి కళాకృతులు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయని కొనియాడారు. విద్యానగర్‌లోని 362 పోలింగ్ బూత్‌లో ఆదివారం బీజేపీ శ్రేణులు మన్‌కీబాత్ వీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నో విషయాలు ప్రజలతో పంచుకున్నారని కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు తెలిపారు. కరీంనగర్‌లో ప్రసిద్ధి చెందిన సిల్వర్‌తో తయారైన బుద్ధుడి ప్రతిమను జపాన్ ప్రధానికి, పూల ఆకృతితో ఉన్న మిర్రర్‌ను ఇటలీ ప్రధానికి బహుకరించిన విషయాన్ని ప్రధాని ప్రస్తావించారన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
కవిత్వంలో వైవిధ్యం అవసరం
కరీంనగర్‌కల్చరల్: కవిత్వంలో వైవిధ్యంతో పాటు నవ్యత ఉండాలని కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సభ్యుడు డా.నాళేశ్వరం శంకరం పేర్కొన్నారు. భవానీ సాహిత్య వేదిక కరీంనగర్ ఆధ్వర్యంలో వైరా గ్యం ప్రభాకర్ అధ్యక్షతన ఆదివారం వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో కుమారి గౌత్రె శ్యామల రచించిన ‘అక్షరమా నీకు వందనం’ కవితా సంపుటి, అనుభవం నేర్పిన పాఠం పుస్తకాలను ఆవిష్కరించారు. పరిచయమున్న అంశాలపై కవిత రాసినా అందులో నవ్యత్వం, కొత్తదనం ఉండాలన్నారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన ఎస్సారార్ కళాశాల ప్రిన్సిపాల్ కలువకుంట రామకృష్ణ మాట్లాడుతూ శ్యామల కవిత్వంలో ప్రకృతి పర్యావరణాలతో పాటు తాత్విక చింతన, మానవతా విలువలున్నాయన్నారు. కవులు తన్నీరు సురేశ్, అన్నాడి గజేందర్‌రెడ్డి, బొమ్మకంటి కిషన్, వెంకటరమణ, వెల్ముల కృష్ణారావు, నగునూరి రాజన్న, గూడెపు కుమార్, స్వామి, సత్యనారాయణరాజు,వేములవాడ ద్రోణాచారి పాల్గొన్నారు.
కొత్త ఆలోచనతో ఆవిష్కరణలు
కొత్తపల్లి(కరీంనగర్): విద్యార్థుల్లోని కొత్త ఆలోచనలు సరికొత్త ఆవిష్కరణలకు దారితీస్తాయని డీఈవో శ్రీరామ్ మొండయ్య అన్నారు. కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ టెక్నో స్కూల్‌లో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన 2025–26, ఇన్‌స్పైర్ అవార్డ్స్ మనాక్ 2024–25 ప్రదర్శనను ఆదివారం సందర్శించారు. డీఈవో మాట్లాడుతూ.. విద్యార్థులు కొత్త ఆలోచనల వైపు మనసు మళ్లించాలన్నారు. చుట్టూ ఉన్న పరిసరాల్లో, సమాజంలో నెలకొన్న సమస్యల పరిష్కార మార్గాలను కనుక్కోవడానికి ఆలోచన చేయాలన్నారు. వైజ్ఞానిక మేళాకు స్పందన వస్తోందని, సుమారు 2,652 మంది విద్యార్థులు ప్రదర్శనను సందర్శించారని జిల్లా సైన్స్ అధికారి జైపాల్ రెడ్డి తెలిపారు. జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు కార్యదర్శి ఎస్.భగవంతయ్య, సెక్టోరియల్ అధికారులు కర్ర అశోక్‌రెడ్డి, ఆంజనేయులు, మిల్కూరి శ్రీనివాస్, కృపారాణి, ఎంఈవోలు ఆనందం, ప్రభాకర్‌రెడ్డి, రవీంద్రాచారి, రామయ్య, రవీందర్, గంగాధర్ పాల్గొన్నారు.
ఘనంగా బాలోత్సవ్
కరీంనగర్‌కల్చరల్: లంబోదర కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని కళాభారతిలో నిర్వహించిన బాలోత్సవ్–2025 ఆకట్టుకుంది. వివేకానంద విద్యాసంస్థల చైర్మన్ కొమురయ్య వేడుకలను ప్రారంభించారు. ఎందరో బాల కళాకారులు ఎంచుకున్న కళల్లో ప్రతిభ కనబరిచి, టీవీ, సినిమాల్లో సత్తా చాటుతున్నారని అభినందించారు. చిన్నారులకు అవార్డులు అందించారు.
కరీంనగర్ ఫిలిగ్రీకి ప్రధాని మోదీ ప్రశంస
కరీంనగర్ ఫిలిగ్రీకి ప్రధాని మోదీ ప్రశంస
కరీంనగర్ ఫిలిగ్రీకి ప్రధాని మోదీ ప్రశంస


