రసవత్తరంగా పల్లెపోరు
‘హస్త’గతం కోసం అధికార కాంగ్రెస్ పట్టు సాధించేందుకు బీఆర్‌ఎస్ ‘కమల’ వికాసానికి తాపత్రయం మొదటి విడత పరిశీలన పూర్తి కొనసాగుతున్న రెండో విడత నామినేషన్లు
రెండో విడత తొలిరోజు నామినేషన్లు అంతంతే
కరీంనగర్: పల్లెపోరు రసవత్తరంగా మారింది. పంచాయతీ ఎన్నికల్లో పట్టు సాధించేందుకు అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. జిల్లాలో తొలివిడతలో సర్పంచ్‌కు చొప్పదండి మండలంలో 124 నామినేషన్లు రాగా.. పరిశీలన తరువాత 80 మిగిలాయి. వార్డుసభ్యులకు 334రాగా.. 332 ఆమోదం పొందాయి. గంగాధర పరిధిలో 266 సర్పంచ్ నామినేషన్లకు 169 ఆమోదం పొందాయి. 725 వార్డుసభ్యులకు 643 మిగిలారు. రామడుగులో సర్పంచ్‌కు 172 రాగా 108, వార్డుసభ్యులకు 529రాగా 480 ఆమోదం పొందాయి. కరీంనగర్ రూరల్‌లో 100 సర్పంచ్ నామినేషన్లకు 68 ఆమోదం పొందాయి. 358 వార్డుసభ్యుల నామినేషన్లకు 301 ఆమోదం పొందాయి. కొత్తపల్లిలో 68కి 38 సర్పంచ్ నామినేషన్లు, 218 వార్డు నామినేషన్లకు 183 ఆమోదం పొందాయి. మొత్తంగా 92 సర్పంచ్ స్థానాలకు 730 నామినేషన్లు దాఖలు కాగా.. 463 ఆమోదం పొందాయి. 866వార్డులకు 2,174 నామినేషన్లు దాఖలు కాగా.. పరిశీలన తరువాత 1,939 ఆమోదం పొందాయి.
అసెంబ్లీ ఎన్నికల తరహాలో పల్లెపోరులోనూ సత్తా చా టాలని అధికార కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. మె జార్టీ పంచాయతీలను తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలతో సమీక్షిస్తున్నా రు. జిల్లాలో ఎక్కువ మంది సర్పంచులు, వార్డు సభ్యులను గెలిపించుకోవాలనే పట్టుదలతో ఉన్న ట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే వ్యూ హాలకు పదును పెట్టి పంచాయతీ ఎన్నికల్లో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తోంది. మెజారిటీ సర్పంచ్ స్థానాల్లో తమ పార్టీ మద్దతుదారులను గెలిపించుకునేందుకు కసరత్తు చేస్తోంది. పార్టీ స్కీంలే తమ విజయానికి దోహదపడతాయని పంచాయతీ ఆశావహులు ఉత్సాహంలో ఉన్నారు.
జిల్లాలోని నాలుగు అసెంబ్లీస్థానాల్లో రెండింటిని దక్కించుకున్న బీఆర్‌ఎస్ ఆ స్థాయిలోనే సర్పంచ్‌లను గెలిపించుకొని తిరిగి ప్రజలలో పట్టు సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. జిల్లాలోని గ్రామపంచాయతీల్లో బీఆర్‌ఎస్‌కు పట్టుండడంతో ఎక్కువ మంది సర్పంచులను గెలిపించుకోవడం ద్వారా, భవిష్యత్‌లో మిగతా ఎన్నికల్లో సత్తా చాటొచ్చని భావిస్తోంది. ప్రస్తుతం పూర్తిస్థాయిలో రంగంలోకి దిగి పంచాయతీల్లో తమ బలం నిరూపించుకునేందుకు మంచి అవకాశంగా భావిస్తోంది. గత పదేళ్లలో తమ ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ గ్రామాల్లో పట్టునిలుపుకునే పనిలో గులాబీ నేతలు నిమగ్నమయ్యారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు ధీటుగా బీజేపీ తన కేడర్‌ను సమాయత్తం చేస్తోంది. ఇప్పటికే పల్లె యువతలో పట్టున్న బీజేపీ అన్ని వర్గాలను కలుపుకొని ఎ క్కువ సంఖ్యలో సర్పంచ్‌లను గెలిపించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. అందుకోసం మండలస్థాయిలో ముఖ్య నేతల ఆధ్వర్యంలో సర్పంచ్, వార్డు అభ్యర్థుల ఎంపికపై నిర్ణయాలు తీసుకుంటుంది. కేంద్ర పథకాలను ఇంటింటికి ప్రచారం చేస్తోంది. కేంద్రం నుంచి వేల కోట్లు నిధులు వస్తున్నాయని, కేంద్రం నిధులతోనే అభివృద్ధి జరుగుతోందని ప్రచారం ప్రారంభించింది. కేంద్ర నిధుల కోసమే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తోందని పార్టీ శ్రేణులు ప్రజలకు వివరిస్తున్నారు.
పట్టు సాధించేందుకు బీఆర్‌ఎస్
కమల వికాసానికి సమాయత్తం
‘హస్త’గతం చేసుకోవాలని..
కరీంనగర్/మానకొండూర్: రెండోవిడత గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఆదివారం ప్రారంభం కాగా.. తొలిరోజు అంతంతే నామినేషన్లు దాఖలయ్యాయి. రెండో విడతగా చిగురుమామిడి, గన్నేరువరం, మానకొండూర్, శంకరపట్నం, తిమ్మాపూర్ మండలాల్లోని 113 గ్రామ పంచాయతీలు, 1,046 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఐదు మండలాల్లో 113 గ్రామపంచాయతీలలో సర్పంచ్‌గా పోటీ చేసేందుకు తొలిరోజు 121 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డుల్లో 1,046 స్థానాలకు 209 నామినేషన్లు దాఖలు చేశారు. సర్పంచ్‌కు చిగురుమామిడి మండలంలో 16, గన్నేరువరంలో 10, మానకొండూర్‌లో 30, శంకరపట్నంలో 35, తిమ్మపూర్‌లో 30 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డు సభ్యులకు చిగురుమామిడి మండలంలో 32 నామినేషన్లు, గన్నేరువరంలో 17, మానకొండూర్ మండలంలో 65, శంకరపట్నంలో 50, తిమ్మాపూర్ మండలంలో 45 నామినేషన్లు వేశారు.
రసవత్తరంగా పల్లెపోరు
రసవత్తరంగా పల్లెపోరు
రసవత్తరంగా పల్లెపోరు
రసవత్తరంగా పల్లెపోరు


