నేడే ప్రారంభం
కరీంనగర్‌క్రైం: జిల్లావ్యాప్తంగా డిసెంబర్ ఒకటో తేదీనుంచి నూతన వైన్స్‌లు ప్రారంభం కానున్నాయి. ఇటీవల నిర్వహించిన నూతన ఎకై ్సజ్ పాలసీలో 94 వైన్స్‌లకు 2,730 దరఖాస్తులు రాగా కలెక్టరేట్‌లో లక్కీడ్రా ద్వారా షాపులు కేటాయించారు. 01 డిసెంబర్ 2025 నుంచి 30 నవంబర్ 2027వరకు దుకాణాల నిర్వహణ ఉంటుంది. ప్రారంభంలోనే వైన్స్‌లకు కిక్కు ఎక్కనుంది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా కొత్త వైన్స్‌లకు గిరాకీ ఉండనుంది. దీంతో నిర్వాహకులు ఫుల్‌స్టాక్‌తో మద్యం అమ్మకాలకు సిద్ధమవుతున్నారు. మొదట్లోనే పెద్దఎత్తున లా భాలుంటాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో డిసెంబర్ 17వ తేదీ వరకు మూడుదశల్లో ఎన్నికలు జరగనుండడంతో మద్యం అమ్మకాలు ఆకాశాన్నంటనున్నాయని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా రోజుకు రూ.5కోట్ల నుంచి రూ.8కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరుగుతాయని ఎకై ్సజ్ అధికారులు అంచనా వేస్తున్నారు.
జిల్లాలో వైన్స్‌లు
ఎకై ్సజ్ స్టేషన్ వైన్స్‌లు
కరీంనగర్ అర్బన్ 21
కరీంనగర్ రూరల్ 26
తిమ్మాపూర్ 14
హుజూరాబాద్ 17
జమ్మికుంట 16
మొత్తం 94


