
హత్య కేసు నిందితులకు రిమాండ్
సామర్లకోట: మండలం పి.వేమవరం గ్రామానికి చెందిన నొక్కు కిరణ్ కార్తిక్ (19) హత్య కేసు నిందితులు నూతలకట్టు కృష్ణప్రసాద్, దూల్లపల్లి వినోద్‌లను శనివారం కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్టు సీఐ ఎ.కృష్ణభగవాన్ విలేకర్లకు తెలిపారు. చెల్లితో మాట్లాడుతున్నాడని ఆమె అన్న కృష్ణప్రసాద్ తన స్నేహితుడు వినోద్‌తో కలసి కార్తిక్‌ను హత్య చేసిన విషయం తెలిసిందే. బ్రహ్మానందపురం జగనన్న లేఅవుట్‌లోకి కార్తిక్‌ను తీసుకువెళ్లి గొంతు నులిమి హత్యచేసినట్టు నిందితులు అంగీకరించారని, వీఆర్వో నాగేశ్వరరావు సమక్షంలో వివరాలు సేకరించి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్టు సీఐ తెలిపారు. కార్తిక్ తండ్రి నొక్కు వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదు చేసిన మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చామని, కృష్ణప్రసాద్‌ను ఎ1గా నమోదు చేశామని సీఐ తెలిపారు.