గ్రూపులు కట్టిన వారికే..
గ్రూపులకే అన్ని షాపులు..
మద్యం షాపులకు ముగిసిన లాటరీ డ్రా
భూపాలపల్లి: మద్యంషాపుల నిర్వహణ ఎంపిక ప్రక్రియకు తెరపడింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలోని 59 మద్యంషాపులకు 1,863 దరఖాస్తులుగా రాగా 57 షాపులకు లాటరీ పద్ధతి ద్వారా డ్రా నిర్వహించారు. జిల్లాకేంద్రంలోని మంజూర్‌నగర్‌లో గల ఇల్లందు క్లబ్ హౌజ్‌లో కలెక్టర్ రాహుల్ శర్మ సమక్షంలో డ్రా ప్రక్రియను వీడియోగ్రఫీ మధ్య పకడ్బందీగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నవీన్‌రెడ్డి పాల్గొన్నారు.
మాధవికే మల్లంపల్లి షాపు..
రెండు జిల్లాల్లో అత్యధికంగా ములుగు జిల్లాలోని మల్లంపల్లి మద్యంషాపునకు 77 దరఖాస్తులు రాగా, ఈ షాపు ఎవరికి దక్కుతుందోననే ఉత్కంఠ నెలకొంది. డ్రా ప్రక్రియలో వెంకటాపురం మండలానికి చెందిన రెడ్డిమల్ల మాధవికి షాపు దక్కింది.
నేడు నోటిఫికేషన్..
ములుగు జిల్లాలోని గెజిట్ నంబర్ 49 చల్వాయి, గెజిట్ నంబర్ 50 గోవిందరావుపేట మద్యంషాపులకు మూడు చొప్పున మాత్రమే దరఖాస్తులు రావడంతో ఎకై ్సజ్ కమిషనర్ ఆదేశాల మేరకు సోమవారం లాటరీ డ్రాను నిలిపివేశారు. ఆ రెండు షాపులకు నేడు(మంగళవారం) నోటిఫికేషన్ విడుదల అవుతుందని, వచ్చే నెల 1వ తేదీ వరకు అప్లికేషన్లు స్వీకరించి, 3వ తేదీన లాటరీ డ్రా నిర్వహిస్తామని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ వెల్లడించారు.
గతంలో మద్యం షాపులను నడిపిన, కొత్తగా రంగంలోకి దిగిన వారు గ్రూపులుగా ఏర్పడి రెండు జిల్లాలోని షాపులకు 50 నుంచి 150 వరకు దరఖాస్తులు సమర్పించారు. అధిక సంఖ్యలో అప్లికేషన్లు వేసిన వీరికే అవకాశం దక్కింది. సింగిల్ డిజిట్‌లో వేసిన వారికి షాపులు రాలేదు. ఇదిలా ఉండగా మద్యం డాన్‌లుగా పేరొంది, వందకు పైగా దరఖాస్తులు సమర్పించిన కొందరికి ఒక్కషాపు కూడా డ్రాలో తగలకపోగా, ఒకరిద్దరికి ఒకటి, రెండు షాపులు మాత్రమే తగిలాయి. డ్రాలో షాపులను దక్కించుకున్న వారు సంతోషంతో బయటకు రాగా, డ్రా తగలని వారు నిరాశతో వెనుదిరిగారు.
మాధవికి మల్లంపల్లి వైన్స్
ఆ రెండు షాపులకు
మళ్లీ దరఖాస్తుల ఆహ్వానం


