రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

Jul 6 2025 6:55 AM | Updated on Jul 6 2025 6:55 AM

రోడ్డ

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

జమ్మికుంట: మున్సిపల్‌ పరిధి ఫ్లైఒవర్‌ బ్రిడ్జిపై 2 బైకులు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. జమ్మికుంట టౌన్‌ సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన జోడు కుమార్‌(27) మున్సిపల్‌ పరిధిలోని అబాది జమ్మికుంటలోని బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కు వెళ్లి శుక్రవారం అర్ధరాత్రి బైక్‌పై వస్తున్నాడు. మున్సిపల్‌ పరిధి కొత్తపల్లి ఫ్లైఒవర్‌ దిగువకు వస్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న రామన్నపల్లి గ్రామానికి చెందిన పురెల్ల మధుకర్‌ అనే వ్యక్తి అజాగ్రత్తగా అతివేగంగా బైక్‌తో ఢీకొట్టాడు. డివైడర్‌పై పడి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తల్లి సమ్మక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

చికిత్స పొందుతూ మృతి

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి మండలం కనగర్తి గ్రామానికి చెందిన నందయ్య (68) ఒంటరి తనం భరించలేక గతనెల 27న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడని రూరల్‌ ఎస్సై మల్లేశ్‌ పేర్కొన్నారు.

నీటి సంపులో పడి బాలుడు..

వేములవాడఅర్బన్‌: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చింతాల్‌ఠాణాలోని లింగంపల్లి రవి–స్వప్న దంపతుల కుమారుడు లింగంపల్లి రిషి(6) శనివారం ప్రమాదవశాత్తు నీటి సంపులోపడి మృతి చెందాడు. శనివారం పాఠశాలకు సెలవు కావడంతో రిషి ఇంటి వద్దే ఉన్నాడు. ఈక్రమంలో ఆడుకుంటూ వీరి ఇంటి పక్కన కొత్తగా నిర్మిస్తున్న గుర్రం బాలకిషన్‌ ఇంటి వద్ద గల నీటి సంపులో పడి మృతిచెందాడు.

విద్యుత్‌షాక్‌తో రైతు..

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి మండలం రంగాపూర్‌ గ్రామానికి చెందిన చింతల రమేశ్‌ (49)అనే రై తు శనివారం పొలంమడికి నీరు పెట్టేందుకు ఉపక్రమిస్తుండగా విద్యుత్‌షాక్‌తో అక్కడికక్కడే మరణించాడు. పొలం దున్నేందుకు వీలుగా మడిలో నీరు నింపేందుకు విద్యుత్‌ మోటారును ఆన్‌చేసే సమయంలో ఈ ప్రమాదానికి గురైనట్లు రూరల్‌ఎస్సై మల్లేశ్‌ పేర్కొన్నారు. మృతుడికి భార్య సంధ్య, కుమారులు ప్రశాంత్‌, పవన్‌కుమార్‌ ఉన్నారు. కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో  యువకుడి దుర్మరణం1
1/2

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో  యువకుడి దుర్మరణం2
2/2

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement