
నెరవేరిన దశాబ్దాల కల
● జగన్నాథ్‌పూర్ వంతెన నిర్మాణానికి రూ.17.5కోట్లు
జగిత్యాలటౌన్: రాయికల్ మండలం జగన్నాథ్‌పూర్ – బోర్నపల్లి మధ్య గోదావరిపై నిర్మించే వంతెన నిర్మాణానికి రూ.17.5కోట్లు మంజూరయ్యాయి. దీంతో ఆదివాసీలు మాజీమంత్రి జీవన్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ముందుగా పట్టణ పోలీస్‌స్టేషన్ నుంచి ఇందిరాభవన్ వరకు డోలు చప్పుళ్లతో చేరుకున్నారు. అక్కడ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి లక్ష్మణ్‌కుమార్ సహకారంతో నిధులు మంజూరయ్యాయని తెలిపారు. వంతెన పూర్తయితే మల్లాపూర్ ప్రాంత ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ నాయకులు, జగన్నాథ్‌పూర్, బోర్నపల్లి ఆదివాసీలు ఉన్నారు.