
మహిళలు ఆరోగ్యంగా ఉండాలి
జగిత్యాలక్రైం: మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం సవ్యంగా సాగుతుందని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో మహిళ పోలీసు సిబ్బందికి హెచ్‌పీవీ క్యాన్సర్ వ్యాక్సినేషన్‌పై ఐఎంఏ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. మహిళలు తమ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ తరుచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తిస్తే ప్రాణాపాయం ముప్ప తగ్గించవచ్చన్నారు. వైద్యులు మహిళల్లో రొమ్ము, సర్వైకల్ క్యాన్సర్లపై వివరించారు. ఐఎంఏ అధ్యక్షుడు గూడూరి హేమంత్, సెక్రటరీ ఆకుతోట శ్రీనివాస్‌రెడ్డి, వైద్యులు పద్మినికుమార్, శ్రీలత, ఏవో శశికళ, ఎస్సై గీత పాల్గొన్నారు.
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
మత్తుపదార్థాల నిర్మూలనే లక్ష్యంగా ప్రతిఒక్కరూ పనిచేయాలని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా పాఠశాలల విద్యార్థులకు స్లోగన్‌రైటింగ్, డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే మత్తుపదార్థాల నిర్మూలనకు విద్యార్థుల్లో చైతన్యం తేవాలన్నారు. అనంతరం ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఎంపిక చేసిన విద్యార్థులను జిల్లా కేంద్రంలో నిర్వహించే పోటీలకు ఎంపిక చేశామన్నారు.
రోల్లవాగు ప్రాజెక్టు పూర్తికి కృషి
సారంగాపూర్: బీర్‌పూర్ శివారులోని రోళ్లవాగు ప్రాజెక్టు పూర్తికి నిరంతరం కృషిచేస్తానని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ తెలిపారు. బీర్‌పూర్ మండలకేంద్రంలో బుధవారం కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ప్రాజెక్టు నిర్మాణం 90శాతం పూర్తయినా అటవీ, పర్యావరణ అనుమతులకు ఆలస్యం అవుతోందన్నారు. సత్వర అనుమతుల కోసం కేంద్ర, రాష్ట్ర ఉన్నతస్థాయి అటవీ అధికారులను కలిశానని పేర్కొన్నారు. రోల్లవాగు ప్రాజెక్టుపై కొంతమంది రాజకీయం చేయడం సరికాదన్నారు. కేడీసీసీబీ డైరెక్టర్ ముప్పాల రాంచందర్‌రావు, తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో లచ్చాలు, విండో చైర్మన్ పొల్సాని నవీన్‌రావు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.