
చర్యలు తీసుకుంటున్నాం
డ్రైనేజీలు తీయించడంతోపాటు మురికినీరు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నాం. ఆయిల్ బాల్స్ వేయిస్తున్నాం. ఫాగింగ్ చేయిస్తున్నాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. సమస్యలుంటే మా దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తాం.
– స్పందన, జగిత్యాల మున్సిపల్ కమిషనర్
డ్రైనేజీలను నిర్మించాలి
మా కాలనీలో డ్రైనేజీలు లేవు. మురుగు నీరు రోడ్లపైనే ప్రవహిస్తోంది. ఖాళీ ప్లాట్లు పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. పాముల బెడద తీవ్రంగా ఉంది. రాత్రిళ్లు బయటకు రావాలంటే భయంగా ఉంది. అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదు.
– రమేశ్, బాలకృష్ణనగర్, మెట్‌పల్లి
ప్రతిపాదనలు పంపించాం
శివారు కాలనీల్లో డ్రైనేజీల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరు కాగానే అవసరమైన చోట వాటిని నిర్మిస్తాం. ఖాళీ ప్లాట్ల యజమానులకు నోటీసులు ఇస్తున్నాం. రోడ్లపై మురుగు నీరు ప్రవహించకుండా తగిన చర్యలు తీసుకుంటాం.
– మోహన్, మెట్‌పల్లి బల్దియా కమిషనర్

చర్యలు తీసుకుంటున్నాం

చర్యలు తీసుకుంటున్నాం