
పనులు నాణ్యతతో చేయాలి
జగిత్యాల: అభివృద్ధి పనులను నాణ్యతతో చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలోని 30వ వార్డులో రూ.13 లక్షలతో నిర్మించనున్న డ్రైనేజీ పనులకు సోమవారం భూమిపూజ చేశారు. పనుల్లో అక్కడక్కడ నాణ్యత లోపిస్తోందని, అలా చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
అనంతరం పట్టణంలోని 126 మందికి రూ.98.11 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. మోతె చెరువు అభివృద్ధికి రూ.3.50 కోట్లు, కండ్లపల్లి చెరువుకు రూ.3 కోట్లు, తిప్పన్నపేట బ్లాక్ స్పాట్ రోడ్‌కు రూ.10 కోట్లు, ఎస్‌కేఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో 10 లక్షల లీటర్ల వాటర్‌ట్యాంక్‌కు రూ.2 కోట్లు మంజూరయ్యాయన్నారు. మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ గిరి నాగభూషణం, మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ ఎల్లారెడ్డి, అడువాల లక్ష్మణ్, తహసీల్దార్ రాంమోహన్ ఉన్నారు.