జూదం.. ఆదాయం | - | Sakshi
Sakshi News home page

జూదం.. ఆదాయం

Jan 20 2025 12:25 AM | Updated on Jan 20 2025 12:25 AM

జూదం.

జూదం.. ఆదాయం

మెట్‌పల్లి: జిల్లాలో పేకాట దందా జోరుగా సాగుతోంది. కొందరు గుట్టుగా శిబిరాలు నిర్వహిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాము చూసుకుంటామని పేకాటరాయుళ్లకు భరోసా ఇస్తూ వారి నుంచి పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారు. కొన్ని చోట్ల ఈ దందాకు పోలీసులు సహకరిస్తున్నారనే విమర్శలున్నాయి. పేకాటతో నిర్వాహకులు జేబులు నింపుకుంటుంటే.. ఆడుతున్న వారిలో ఎంతోమంది ఆర్థికంగా చితికిపోయి ఇబ్బంది పడుతున్నారు.

మామిడి తోటలు.. అటవీ ప్రాంతాల్లో శిబిరాలు

● నిర్వాహకులు పేకాట శిబిరాల విషయంలో పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు.

● పోలీసుల దృష్టిలో పడకుండా గ్రామాలకు దూరంగా ఉండే మామిడితోటలు, అటవీ ప్రాంతాలను ఎంచుకుంటున్నారు.

● అక్కడకు వచ్చే వారికి పోలీసుల దాడులు జరగకుండా అన్నీ తాము చూసుకుంటామని నమ్మిస్తూ రప్పిస్తున్నారు.

● జూదరులను ఆకట్టుకోవడానికి శిబిరాల్లో మందు, నాన్‌వెజ్‌ వంటకాలతో విందును ఏర్పాటు చేస్తున్నారు.

● శిబిరాలను కొన్ని రోజులు ఒకచోట.. మరికొద్ది రోజులు మరో చోటుకు తరలిస్తున్నారు.

నిర్వాహకులకు భారీగా ఆదాయం

● పేకాట దందాతో నిర్వాహకులు ప్రతిరోజూ రూ.వేలల్లో ఆదాయాన్ని పొందుతున్నారు.

● శిబిరాల్లో రూ.5వేలు మొదలు రూ.10వేల వరకు ఆడుతారు.

● ఎంత ఆట ఆడితే అంత మొత్తాన్ని ముందుగానే నిర్వాహకులు తీసుకుంటారు.

● వచ్చిన ఆదాయం నుంచే జూదరులకు మందు, విందు ఇతర వసతులకు ఖర్చు చేస్తున్నారు.

‘మామూలు’గా తీసుకుంటున్న పోలీసులు

● పేకాట శిబిరాల నిర్వాహకుల్లో ఎక్కువ మంది రాజకీయ నాయకులు ఉన్నారనే ప్రచారం ఉంది.

● వీరు స్థానిక పోలీసులకు నెల వారీగా మామూళ్లు ఇస్తూ శిబిరాలను దర్జాగా నిర్వహిస్తున్నారనే విమర్శలున్నాయి.

● గ్రామాలు, పట్టణాల్లో కొందరికి పేకాట తప్ప వేరే వ్యాపకం లేదు. అలాంటి వారు ప్రతిరోజు ఎక్కడో ఓ చోట ఆడుతారు.

● వారిపై నిఘా పెడితే శిబిరాల ఆచూకీని కనిపెట్టే అవకాశముంటుంది.

● పోలీసులు అలా చేయకపోవడం విమర్శలకు తావిస్తుంది.

ఆర్థికంగా చితికిపోతున్న కుటుంబాలు

● పేకాటతో ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి.

● కొందరు రూ.లక్షలు పోగొట్టుకుని మరికొందరు ఆస్తులను అమ్ముకొని అప్పుల పాలు కావడంతో వారి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి.

● ‘మామూలు’గా తీసుకుంటున్న పోలీసులు ఈ దందా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో వందలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.

● ఉన్నతాధికారులు స్పందించి పేకాటను నియంత్రించడానికి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

జిల్లాలో జోరుగా పేకాట దందా

శిబిరాలతో సులభంగా సంపాదన

‘మామూలు’గా తీసుకుంటున్న పోలీసులు

రోడ్డున పడుతున్న కుటుంబాలు

ఈ చిత్రం మెట్‌పల్లి మండలంలోని కోనరావుపేట శివారు

అటవీ ప్రాంతంలో నిర్వహిస్తుండగా పట్టుబడిన పేకాట శిబిరం. కథలాపూర్‌ మండల కేంద్రాని కి చెందిన ఓ వ్యక్తి దీనిని నిర్వహిస్తున్నాడు. పేకాటరాయుళ్లను అక్కడకు రప్పించి.. వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు. గుట్టుగా నిర్వహిస్తున్న ఈ శిబిరంపై ఇటీవల పోలీసులు దాడి జరిపి 12మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇలా ఈ ఒక్క చోటనే కాదు.. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చాలా మంది పేకాట శిబిరాలను నిర్వహిస్తూ జేబులు నింపుకుంటున్నారు.

పేకాటపై దృష్టి పెట్టాం

పేకాటపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ఎక్కడైనా శి బిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే ప్రజలు ఆ స మాచారాన్ని పోలీసులకు అందించాలి. అవసరమైతే డయల్‌ 100కు ఫోన్‌ చేయాలి. శిబిరా ల నిర్వాహకులు ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తి లేదు. పట్టుకొని వారిపై కేసులు నమో దు చేస్తాం.

– నిరంజన్‌రెడ్డి,

సీఐ, మెట్‌పల్లి

జూదం.. ఆదాయం1
1/1

జూదం.. ఆదాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement