
వడగండ్లతో కూడిన వర్షం కురవడంతో సుమారు 50 ఎకరాల్లో నువ్వుల పంట నేలవాలినట్లు రైతులు
కథలాపూర్(వేములవాడ): జిల్లాలోని పలు ప్రాంతా ల్లో సోమవారం మరోసారి భారీవర్షం కురిసింది. కథలాపూర్ మండలం తాండ్య్రాలలో వడగండ్లతో కూడిన వర్షం కురవడంతో సుమారు 50 ఎకరాల్లో నువ్వుల పంట నేలవాలినట్లు రైతులు పేర్కొన్నారు. పోసానిపేటలోనూ భారీవర్షం కురిసింది.
ఆరుగాలం శ్రమ నీటిపాలు..
పెగడపల్లి(ధర్మపురి): నందగిరి, అయితిపల్లి గ్రా మాల్లో వడగండ్లవాన పంటలను తీవ్రంగా దెబ్బ తీసింది. రెండు గ్రామాల్లో పొట్టదశలోని వరిపైరు దెబ్బతినగా, మామాడి కాయలు నేలరాలాయి. దె బ్బతిన్న పంటలను అధికారులు పరిశీలించి పరిహారం ఇప్పించాలని రైతులు కోరుతున్నారు.
