US Oklahoma Hospital Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

Gun Shooting At Oklahoma hospital In Tulsa - Sakshi

అగ్ర రాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం సృష్టించింది. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం చోటుచేసుకున్న కాల్పుల్లో నలుగురు మృతి చెందగా 10 మందికి పైగా పౌరులు గాయపడ్డారు. 

వివరాల ప్రకారం.. ఒక్లహామాలోని సెయింట్ ఫ్రాన్సిస్ ఆసుపత్రిలో దుండగుడు కాల్పులు జరిపాడు. కాగా, అతడు ఆర్థోపెడిక్‌ సర్జన్‌ కోసం ఆసుపత్రికి వచ్చినట్టు సమాచారం. ఆసుపత్రిలో వైద్యుడు కనిపించలేదని విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల ఘటన వైద్యుడు సహా ఇద్దరు నర్సులు మృతిచెందారు. అయితే, కాల్పులు జరిపిన తర్వాత దుండగుడు కూడా తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఇదిలా ఉండగా.. ఇటీవలే అమెరికాలో సాల్వడార్‌ రామోస్‌(18) మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. ఓ ఎలిమెంటరీ స్కూల్లోకి చొరబడి విచ్చలవిడి కాల్పులకు దిగాడు. 19 మంది స్టూడెంట్లతో పాటు ఇద్దరు టీచర్లను పొట్టన పెట్టుకున్నాడు. టెక్సాస్‌ రాష్ట్రంలో శాన్‌ ఆంటోనియోకు 134 కిలోమీటర్ల దూరంలోని ఉవాల్డే టౌన్‌లో ఈ దారుణం జరిగింది. హంతకున్ని సాల్వడార్‌ రామోస్‌ అనే స్థానికునిగా గుర్తించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top