యజమాని కోసం నిరీక్షిస్తున్న కుక్క!

Dog Refuses To Leave Side Of Owners Body In Kyiv - Sakshi

Ukraine Hachiko Dog: ఉక్రెయిన్‌ పై నెలరోజలుకు పైగా దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో రష్యా యుద్ధా నేరాలకు పాల్పడుతోంది. అయితే ఉక్రెయిన్‌ రాజధాని కైవ్‌ ప్రాంతంలో రష్యా దళాల చేతిలో ఒక వ్యక్తి చనిపోయాడు. అయితే అతని పెంపుడు కుక్క అతనిని వదిలి వెళ్లేందుకు నిరాకరించింది. అతని మృతదేహం పక్కనే దీనంగా కూర్చొని ఉన్న ఉద్వేగభరితమైన ఫోటోని తూర్పు యూరోపియన్ నెక్స్టా మీడియా పోస్ట్‌ చేసింది.

ఈ సంఘటన 1930లలో మరణించిన తర్వాత తొమ్మిదేళ్లపాటు తన యజమాని కోసం ఎదురుచూసిన జపనీస్ కుక్క హచికో కథను గుర్తుచేస్తోంది. రష్యా దాడులు కారణంగా ఉక్రెయిన్‌లో వేలాది మంది పౌరులు నిరాశ్రయులయ్యారు. మరోవైపు బూచో నగరం శవాల దిబ్బగా మారిపోయింది.

(చదవండి: ఊచకోత.. ఊహించినదానికంటే ఎక్కువే!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top