
మొబైల్ స్నాచింగ్ కోసం బైక్ చోరీ..
బంజారాహిల్స్: మొబైల్ స్నాచింగ్‌ల కోసం బైక్ చోరీకి పాల్పడిన ఇద్దరు పాత నేరస్తులను జూబ్లీహిల్స్ పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే..ఆగాపురాకు చెందిన నసీర్‌ఖాన్ అలియాస్ నజీర్ ఆటోడ్రైవర్‌గా పని చేసేవాడు. అప్జల్‌సాగర్‌కు చెందిన ఇర్ఫాన్‌ఖాన్ అలియాస్ అర్మాస్ ఫర్నీచర్ షాపులో వర్కర్‌గా పని చేస్తున్నాడు. స్నేహితులైన వీరు జల్సాలకు అలవాటు పడ్డారు. వీరిపై నగరంలోని పలు పోలీస్‌స్టేషన్ల పరిధిలో మొబైల్ స్నాచింగ్‌లతో పాటు బైక్ చోరీలు, హత్యాయత్నం కేసులు ఉన్నాయి. ఏప్రిల్ 18న హయత్‌నగర్‌లో ఓ బైక్ చోరీ చేసిన బైక్ చోరీ చేసిన రషీద్ ఖాన్ అదే బైక్‌పై ఇర్ఫాన్‌ఖాన్‌తో కలిసి ఏప్రిల్ 30న బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో 5 మొబైల్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. ఫిర్యాదు అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. జూబ్లీహిల్స్‌లో స్నాచింగ్ జరిగిన ప్రాంతం నుంచి నాలుగు రోజుల పాటు 100 సీసీ కెమెరాలను పరిశీలించారు. గురువారం ఉదయం వీరు ఇద్దరూ హబీబ్‌నగర్‌లోని ఓ ఇంటి ఎదుట ఆగడాన్ని గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో రషీద్‌ఖాన్‌పై ఫిలింనగర్, బంజారాహిల్స్, హయత్‌నగర్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, నాంపల్లి, రాజేంద్రనగర్, కూకట్‌పల్లి, హుమాయున్‌నగర్ పోలీస్‌స్టేన్ల పరిధిలో 17 కేసులు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఇర్ఫాన్‌ఖాన్‌పై హబీబ్‌నగర్, హుమాయున్‌నగర్, మార్కెట్, గుడిమల్కాపూర్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో 6 కేసులు ఉన్నట్లు తెలిపారు. వీరిద్దరూ కలిసి మొబైల్ స్నాచింగ్‌ల కోసమే బైక్ చోరీ చేసినట్లుగా గుర్తించారు. వీరి నుంచి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇద్దరు పాత నేరస్తుల అరెస్టు

మొబైల్ స్నాచింగ్ కోసం బైక్ చోరీ..

మొబైల్ స్నాచింగ్ కోసం బైక్ చోరీ..