మామిడిలో సస్యరక్షణకు హోమియో మందులు

Homeo Medicines for Plant Protection in Mango - Sakshi

మామిడి పూత, పిందె దశలో సస్యరక్షణకు హోమియో మందులు ఎంతగానో ఉపయోగపడతాయని యాదాద్రి భువనగిరి జిల్లా రామకృష్ణాపురంలోని అమేయ కృషి వికాస కేంద్రం వ్యవస్థాపకులు, రైతు శాస్త్రవేత్త జిట్టా బాల్‌రెడ్డి చెబుతున్నారు. ఆయన మాటల్లోనే.. 

 మామిడి చెట్లకు పూత సరిగ్గా రావాలంటే ZINCUMET-30, MAGPHOS-30, BORAN / BORAX-30  ఆౖఖఅగీ30 మందులను వారం రోజుల వ్యవధిలో 3 సార్లు చొప్పున.. ఒకదాని వెంట మరొకటి 3 సార్లు పిచికారీ చేసుకోవాలి. అట్లనే పూత బలంగా రావటం కోసం PULSATILLA-30 ను కూడా పిచికారీ చేసుకోవాలి.
 దోమ నుంచి పూతను, పిందెను కాపాడుకోవడానికి COCCINELLA SEPTE - 30 పిచికారీ చేసుకోవాలి.
►  రేగు కాయల పరిమాణంలోకి వచ్చిన మామిడి కాయలు రాలిపోతుంటే BOVISTA -30  పొటెన్సీలో పిచికారీ చేసుకోవాలి. మంచు ఎక్కువగా పడుతుంటే పూత, పిందెను రక్షించుకోవడానికి CUPRUM SULPH-30  పిచికారీ చేసుకోవాలి.
►  మంగుతో కాయ నల్లగా మారుతూ ఉంటే, ముడ్డుపుచ్చు (ఆంత్రాక్నోస్‌)ను నివారించుకోవడానికి  ALYSIC ACID-30 CARBOVEG-30 పిచికారీ చేసుకోవాలి.
► కొమ్మెండు తెగులు నుంచి రక్షించుకోవడానికి CUPRUM SULPH-30  పిచికారీ చేసుకోవాలి.
► పాత తోటల్లో మామిడి ఆకులపైన బుడిపెలు (మాల్‌ ఫార్మేషన్‌) వస్తే కొమ్మలను కత్తిరించి, దూరంగా తీసుకెళ్లి తగులబెట్టాలి. ఇది అంటు వ్యాధి. అరికట్టకపోతే దిగుబడిపై కూడా ప్రభావితం చూపిస్తుంది. TUJA-200 ను వారంలో 3 సార్లు పిచికారీ చేసుకుంటే పోతుంది.
► కాయ పెరుగుదల మొదటి దశలోAMONIUMPHOS-30 పిచికారీ చేసుకోవచ్చు. తర్వాత కాయ పెరుగుతున్న దశలో UPHALA-30ను పిచికారీ చేసుకోవచ్చు. ఇది అమేయ కృషి వికాస కేంద్రం రూ΄పొం దించిన మందు. బయట మందుల షాపులో దొరకదు. త్రిబుల్‌19కు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది.
► మామిడి రైతులకు మరో ముఖ్య సూచన ఏమిటంటే.. 15 రోజులకోసారి నీటి తడులతో పాటు ఎకరానికి 800 నుంచి 1,000 లీటర్ల వరకు గోకృపామృతం పారించుకుంటే.. కాయ పరిమాణం బాగుంటుంది, కాయ రాలకుండా ఉంటుంది. మరిన్ని వివరాలకు ఈ కింది వీడియో చూడొచ్చు. www.youtube.com/@ameyakrishivikasakendram5143

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top