 
													పై రెండు ఫొటోల్లో తేడా గమనించారా? ఏం లేదే మామూలుగానే ఉందని అనుకుంటున్నారా? మళ్లీ ఓ పాలి.. ఓ లుక్కెయ్యండి.. అర్థమైందా.. అవును! పై ఫొటోలో దట్టంగా ఉన్న మంచు కాస్తా.. కింది ఫొటోలో అట్టడుగుకు చేరిపోయింది. ఐతే ఏంటట.. అంటారా? దీనికి ఈ భూమిపై తలెత్తనున్న పెను ప్రమాదాలకు చాలా దగ్గరి సంబంధం ఉంది మరీ! అందుకే ఈ వివరణంతా... ప్రస్తుతం నెట్టింట ఈ ఫొటో తెగ వైరల్ అవుతోంది.
100 సంవత్సరాల తేడాతో వేసవికాలంలో తీసిన ఫొటోలివి. పై ఫొటో దాదాపు 105 సంవత్సరాలనాటిది. కింది ఫొటో తాజాగా తీసింది. కేవలం వందయేళ్ల కాలంలో ఆర్కిటిక్ ప్రాంతంలో మంచంతా ఇలా నీరుగారిపోయింది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా నెమ్మదిగా దెబ్బతింటున్న ఆర్కిటిక్‌కి సంబంధించిన ఉత్కంఠభరితమైన ప్రకృతి దృశ్యమిది. వాతావరణ మార్పులు తీవ్ర వానలు, వరదల వెనుక దిగ్భ్రాంతికి గురిచేసే వాస్తవం ఇది.
చదవండి: చనిపోయే ముందు వ్యకుల ప్రవర్తన ఇలానే ఉంటుందట..! నీడలను చూడటం..
‘గ్లేసియర్ కంపారిజన్ - స్వాల్‌బార్డ్’ క్యాప్షన్‌తో క్రిస్టియన్ అస్లాండ్ అనే ట్రావెల్ ఫొటోగ్రాఫర్ ఆర్కిటిక్‌లోని వాతావరణ మార్పుల గురించి డాక్యుమెంటరీ తయారు చేశాడు. ఈ స్వీడిష్ ఫోటో జర్నలిస్ట్ 2017లో నేషనల్ జియోగ్రాఫిక్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధంగా తన అనుభవాలను పంచుకున్నాడు- ‘నేను ఈ ఫొటోను 2003లో తీశాను. వాతావరణ మార్పు పట్ల నా వైఖరి భిన్నంగా ఉంది. చాలా యేళ్ల తర్వాత సరిగ్గా అదే లొకేషన్ నుండి ఫొటో షూట్ చేయడం ఆనందాన్నిచ్చింది. వాతావరణ మార్పు సమస్య గురించి ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలనే ఈ ఫొటో షూట్ చేశాన’ని చెప్పుకొచ్చాడు.
చదవండి: నదిలో తేలుతున్న వందల అస్థిపంజరాలు.. మిస్టరీ డెత్ వెనుక అసలు కారణం ఏమిటీ?
This is Arctic 105 years apart. Both picture taken in summer. Do you notice anything special. Courtesy Christian Åslund. pic.twitter.com/9AHtLDGKRb
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) November 24, 2021

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
