
‘స్కిన్ టెక్ ఏఐ–2025’ భారత బ్యూటీ ఇండస్ట్రీకి సరికొత్త నాందిగా నిలుస్తుందని మిస్ ఇండియా ఎర్త్ డాక్టర్ తేజస్విని మనోజ్ఞ పేర్కొన్నారు. హైదరాబాద్ నాలెడ్జి సిటీలోని టీ హబ్ వేదికగా దేశంలో తొలిసారిగా వార్షిక స్కిన్ కేర్ అండ్ బ్యూటీ ఏఐ/టెక్ సదస్సు–స్కిన్ టెక్ ఏఐ–2025 పేరిట నిర్వహించారు. సదస్సు థీమ్ అనేది స్కిన్ కేర్ రంగంలో భవిష్యత్తుకు మలుపుగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
ఇది నూతన ఆవిష్కరణ, డేటా, వినియోగదారుల ఆధారంగా భవిష్యత్తును నిర్మిస్తుందన్నారు. ఈ తొలి కార్యక్రమంలో హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడం, తనకు అవకాశం కల్పించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ స్కిన్ కేర్, బ్యూటీ రంగంలో చోటుచేసుకుంటున్న మార్పులపై చర్చించారు. అనంతరం దేశంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన ఏఐ స్కిన్ స్కేర్ వెండింగ్ మిషన్ ఆవిష్కరించారు. ఎంపీఎఫ్ సీఈఓ సుశిల్ కుమార్, స్కిన్ కేర్ రంగంలో ప్రముఖులు నిజామ్ మహ్మద్, స్టార్టప్‌ల మెంటర్ డాక్టర్ లక్ష్మీ దివ్య, రామ్ చింతలపూడి, శశిమూర్తి పాల్గొన్నారు.
(చదవండి: అబ్బురం అపురూపం..! అరుదైన గణపతి ప్రతిమలు..ఏకంగా 39 దేశాలు)