ప్రభుత్వం మెడలు వంచుదాం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం మెడలు వంచుదాం

Nov 29 2025 7:23 AM | Updated on Nov 29 2025 7:23 AM

ప్రభు

ప్రభుత్వం మెడలు వంచుదాం

నాటక పోటీలు ప్రారంభం దుర్మార్గ ప్రభుత్వమిది కొల్లేటికోటలో ఆగని ఆక్రమణలు

న్యూస్‌రీల్‌

నాటక పోటీలు ప్రారంభం
తోలేరులో 21వ జాతీయస్థాయి నాటికల పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. మంచి మనసులు, మా ఇంట్లో మహాభారతం నాటికలు ఆకట్టుకున్నాయి. 8లో u
దుర్మార్గ ప్రభుత్వమిది

కొల్లేటికోట పెద్దింట్లమ్మ ఆవరణ సమీపంలో ఆక్రమణలకు అడ్డకట్ట పడటం లేదు. శుక్రవారం మరో ముగ్గురు అక్రమ కట్టడాలకు సిద్ధమయ్యారు. 8లో u

శనివారం శ్రీ 29 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

సాక్షి, భీమవరం/పాలకొల్లు సెంట్రల్‌: ఎన్నికల హామీలను అటకెక్కించి వంచనతో పాలన సాగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై పోరుబాట పట్టాలని, సంస్థాగతంగా క్షేత్రస్థాయి నుంచి వైఎస్సార్‌సీపీని బలోపేతం చేసే దిశగా జిల్లా సమన్వయ కమిటీ సమావేశం పాలకొల్లులో ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. దగా పడిన ప్రజల పక్షాన అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చిన ఉద్యమాల విజయవంతానికి, భవిష్యత్‌ కార్యాచరణపై పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ బొత్స సత్యనారాయణ నేతలకు దిశానిర్ధేశనం చేశారు.

వైఎస్సార్‌సీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద రాజు అధ్యక్షతన శుక్రవారం పాలకొల్లు అడబాల గార్డెన్స్‌లో జరిగింది. బొత్స ముఖ్య అతిథిగా హాజరైన సమావేశంలో ఎమ్మెల్సీలు వంక రవీంద్ర, కవురు శ్రీనివాస్‌, పార్లమెంట్‌ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, మాజీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, నియోజకవర్గ కోఆర్డినేటర్లు గుడాల శ్రీహరిగోపాలరావు, పీవీఎల్‌ నరసింహరాజు, చినమిల్లి వెంకటరాయుడు పాల్గొన్నారు. మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా జరుగుతోందని, ఇప్పటికే 80 శాతానికి పైగా లక్ష్యం చేరుకున్నామని, మండల, మున్సిపాల్టీల మెయిన్‌ కమిటీలు దాదాపు పూర్తయ్యాయని ప్రసాదరాజు వివరించారు. మిగిలినవి త్వరితగతిన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, జిల్లాలో ప్రధానమైన వరి, ఆక్వా రైతులకు అండగా ఉద్యమ కార్యాచరణ చేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలని పార్లమెంట్‌ పరిశీలకుడు మురళీకృష్ణంరాజు కోరారు. పార్టీ కేడర్‌ను సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి చేస్తున్న కృషిని కోఆర్డినేటర్లు వివరించారు. విద్య, వైద్యం, వ్యవసాయం తదితర అన్ని రంగాల్లో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఉద్యోగాలు కల్పిస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని యువతను, ఆడబిడ్డ నిధి పేరిట మహిళలను వంచించిందని, ఏడాదిన్నరలో ఒక్క కొత్త పింఛన్‌ ఇవ్వలేదని, గతంతో పోలిస్తే రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని, సంక్షేమ పథకాల్లో కోతలు పెట్టి అర్హులకు అన్యాయం చేస్తున్నారని ఎస్‌ఈసీ సభ్యుడు పెండ్ర వీరన్న, రాష్ట్ర కార్యదర్శులు ముప్పిడి సంపత్‌కుమార్‌, పేరిచర్ల విజయనరసింహరాజు, యడ్ల తాతాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఖండవల్లి వాసు, జిల్లా ఉపాధ్యక్షుడు కర్రి రామలింగేశ్వరరెడ్డి, జిల్లా స్పోక్‌ పర్సన్లు కామన నాగేశ్వరరావు, జి.సుందర్‌కుమార్‌, గుబ్బల వీరబ్రహ్మం తదితరులు వివరించారు. చంద్రబాబు ప్రభుత్వం, కూటమి నేతల వైఖరి పట్ల అప్పుడే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోందని, జగన్‌ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం అవుతున్నాయని నేతలు తెలిపారు.

సంస్థాగతంగా బలోపేతం కావాలి: బొత్స

.

ఉత్సాహంగా కోటి సంతకాల సేకరణ

క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కార్యాచరణ

శరవేగంగా కమిటీల నియామకాలు

పాలకొల్లులో వైఎస్సార్‌సీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో పలు అంశాలపై చర్చ

పార్టీ నేతలకు రీజనల్‌ కోఆర్డినేటర్‌ బొత్స దిశానిర్దేశం

పార్టీ అధ్యక్షుడు జగనన్‌ ఆదేశాల మేరకు సంస్థాగతంగా పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా పార్టీ నేతలు సమన్వయంతో పనిచేయాలని రీజనల్‌ కోఆర్డినేటర్‌ బొత్స సూచించారు. జిల్లాలో పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తుండటం, కమిటీల నియామకాలపై నేతలను అభినందించారు. అక్రమ కేసులకు భయపడాల్సిన పనిలేదని పార్టీ నేతలకు జగన్‌ ఎప్పుడూ అండగా ఉంటారన్నారు. పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని బొత్స తెలిపారు. గ్రామస్థాయిలో కమిటీల నియామకం, భవిష్యత్‌ కార్యాచరణపై కేడర్‌కు దిశా నిర్దేశం చేశారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయని, రాజకీయ హత్యలు, బాలికలు, మహిళలపై అత్యాచారాలు, దాడులు పెరిగాయన్నారు. విద్య, వైద్యం ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటాయని, ప్రైవేటు పరం చేసిన దాఖలాలు ఎక్కడా లేవన్నారు. జగన్‌ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందనే దుర్బుద్ధితో చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. పాలకొల్లులో ప్రభుత్వ కళాశాల, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రభుత్వం అధీనంలో ఉంటే మంచిదా? ప్రైవేటు పరం చేస్తే మంచిదా ? అనే విషయాలను ప్రజలు ఆలోచించాలని బొత్స కోరారు

సాక్షి, భీమవరం: పేదల ప్రయోజనాల పట్ల చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గం వ్యవహరిస్తోందని వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్యం, పేద విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేసేందుకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 26 జిల్లాల్లో 26 మెడికల్‌ కళాశాలలు ఉండాలని ఆలోచన చేశారన్నారు. చంద్రబాబు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కొందరు కూటమి నేతలు కూడా వ్యతిరేకిస్తున్నారని గుర్తుచేశారు. ఏ ప్రభుత్వం కూడా విద్య, వైద్యాన్ని ప్రైవేటుపరం చేసిన దాఖలాలు లేవని, చంద్రబాబు ప్రభుత్వం పేదవాళ్లపై ఎందుకు కక్షగట్టిందో అర్థం కావడం లేదని చెప్పారు. అమరావతి పేరిట రూ.2 లక్షల కోట్లు అప్పులు తెచ్చిన ప్రభుత్వం కేవలం రూ.5 వేల కోట్లు మెడికల్‌ కళాశాలలకు ఎందుకు కేటాయించలేకపోయిందని ప్రశ్నించారు.

రాష్ట్రంలో అరాచక రాజ్యం : రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని, పోలీసులు, తన అనుకూల మీడియాతో చంద్రబాబు ప్రభుత్వాన్ని నడపుతున్నారని ఎద్దేవా చేశారు. భీమవరంలో పేకాట క్లబ్బులు ఎక్కువ ఉన్నాయని, ఎప్పుడూ లేని విధంగా ప్రతి నియోజకవర్గంలో విచ్చలవిడిగా జూద కార్యకలాపాలు జరుగుతున్నాయని తెలిపారు. నాయకులు, పోలీసులు కుమకై ్క దోచేస్తున్నారని విమర్శించారు. ఈ విషయమై ఉప ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించడం చూస్తే వాస్తవమేనని అనిపించిందని, మరో నాయకుడు వచ్చి అబ్బే అదేం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రైతులను సైతం ప్రభుత్వం నట్టేట ముంచిందని, ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తివేసిందని విమర్శించారు. ఏ రైతుకూ బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ రాలేదన్నారు. పంటలకు గిట్టుబాటు ధర లేదని చెప్పారు. వసతి గృహాల్లో కలుషిత ఆహార సంఘటనలు ఎన్ని జరిగాయో చూడాలన్నారు. సంక్రాంతి నాటికల్లా గోతులు పూడ్చాలంటూ చంద్రబాబు మళ్లీ పాత పాటే పాడుతున్నారని విమర్శించారు. పాలకొల్లు మెడికల్‌ కళాశాల వద్దకు వచ్చి హడావుడి చేసిన నిమ్మల ఇప్పుడు మంత్రి హోదాలో ఉండి తట్టెడు మట్టి పోసిన పాపాన పోలేదని బొత్స విమర్శించారు. ప్రభుత్వ ఆధీనంలో ఉంటే మంచిదో? లేక ప్రైవేటీకరణ చేస్తే పేదలకు మేలు జరుగుతుందో ప్రజలకు చెప్పాలని మంత్రి నిమ్మలకు సూచించారు.

ప్రభుత్వం మెడలు వంచుదాం1
1/1

ప్రభుత్వం మెడలు వంచుదాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement