భళా.. శిల్పకళ
చిన్నతిరుపతి దివ్య క్షేత్రంలో నూతన అనివేటి మండపంలో శిల్పకళా వైభవం ఉట్టిపడుతోంది. దేవతామూర్తుల విగ్రహాలతో శోభిల్లుతోంది. దేవస్థానం రూ.12 కోట్ల వ్యయంతో ఏడాది క్రితం చేపట్టిని అనివేటి మండపం (జంటగోపురాల వరకు) విస్తరణ పనులు ఇటీవల పూర్తి కాగా, రంగులు వేసే పనులు తుది దశకు చేరుకున్నాయి. మండప ముఖ ద్వారంలో నిర్మించిన రాజ భటులు, గరుడాళ్వార్, ఆంజనేయ స్వామి, ఏనుగుల విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అలాగే మండప సీలింగ్‌పై దశావతారాలను తీర్చిదిద్దారు. మండపం చుట్టూ పలు దేవతామూర్తుల విగ్రహాలను జీవకళ ఉట్టిపడేలా నిర్మించారు. భక్తులు ఈ మండపంలో ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం శుక్ర మౌఢ్యమి కావడంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి తరువాతే ఈ మండప ప్రారంభోత్సవం జరిగే అవకాశం ఉంది. – ద్వారకాతిరుమల
అనివేటి మండపం సీలింగ్‌పై దశావతారాలు


