ఆందోళన ఆవరించే
న్యూస్‌రీల్
సీఎం ఏమన్నారంటే
బుధవారం శ్రీ 3 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
సాక్షి ప్రతినిధి, ఏలూరు: రాష్ట్ర ధాన్యాగారంగా ఖ్యాతిగాంచిన ఉమ్మడి పశ్చిమలో వరి సాగు రైతుల్లో ఆందోళన ప్రారంభమైంది. రెండు సీజన్లలో లక్షలాది ఎకరాల్లో సాగు చేసి లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి సాధిస్తారు. అనేక తుపానులు, వరదలు, ఇతర ప్రకృతి విపత్తులను అన్నింటిని తట్టుకుని అప్పులు తెచ్చి మరీ వరిని సాగు చేస్తూ ఉన్న రైతులు జిల్లావ్యాప్తంగా లక్షల్లో ఉన్నారు. అలాంటి రైతులను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం జిల్లా పర్యటనలో వరి ఒక పంటే పండించాలంటూ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ఇప్పటికే ఇన్‌పుట్ సబ్సిడీలు మొదలుకొని ఎలాంటి పరిహారాలు లేకపోయినా ఎంతటి నష్టం వచ్చినా సంప్రదాయ సాగుగా వరిని జిల్లాలో సాగు చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్, రబీ సాగులలో ప్రధానమైన పంట వరి. ఏలూరు జిల్లాలో ఖరీఫ్‌లో వరిసాగు చేస్తుండగా రబీలో వరితో పాటు వాణిజ్య పంటలను రైతులు సాగు చేస్తుంటారు. ప్రధానంగా ఏలూరు జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో వరి సాగు 2.10 లక్షల ఎకరాల్లో ఉండగా ఉద్యానపంటలు 2.90 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. అదే విధంగా రబీ సీజన్‌లో 2.80 లక్షల ఎకరాలకు పైచిలుకు ఉద్యాన పంటలు ఉండగా 2.25 లక్షల ఎకరాల్లో వరి, మొక్కజొన్న, పొగాకు వంటి పంటలు జిల్లాలో సాగవుతున్నాయి. గతేడాది రబీ(2023–24)లో ధాన్యం ఉత్పత్తి 2.40 లక్షల టన్నులు ధాన్యం ఉత్పత్తి కాగా, 2024–25లో 3.53 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో 6 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి వస్తుందని అధికారులు ఇప్పటికే అంచనా వేశారు. దీనికి సిద్ధంగా 4.50 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఖరీఫ్, రబీ సీజన్లల్లో లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తవుతుంది. ముఖ్యమంత్రి స్థాయిలో ధాన్యాన్ని వదిలేయాలి అనడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
పశ్చిమగోదా వరి జిల్లాలో ఖరీఫ్‌లో మొత్తం సాగు 3.65 లక్షల ఎకరాల్లో చేస్తుండగా దీనిలో 2.41 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. రబీలో 1.40 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తుండగా 2.20 లక్షల ఎకరాలు వరి సాగు చేస్తున్నారు. రబీ, ఖరీఫ్ సీజన్‌లో కేవలం వరి సాగు 4.60 లక్షల ఎకరాలకు పైబడి సాగు చేస్తూ లక్షల మెట్రిక్ టన్నుల్లో ధాన్యం ఉత్పత్తి చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో దాదాపు 10 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తూ సుమారు 15 లక్షల టన్నుల ధాన్యాన్ని ఉమ్మడి జిల్లా రైతులు ఉత్పత్తి చేస్తున్నారు. లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం ఉత్పత్తి చేస్తున్న సమయంలో పశ్చిమగోదావరి జిల్లా ధాన్యాగారంగా పేరు పొందింది. అయితే ప్రస్తుతం వరి వద్దు.. ఇతర పంటల ముద్దు అనే ధోరణిలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉంది.
వరి ఒక్క పంటకే పరిమితం చేయమన్న సీఎం వ్యాఖ్యలపై కలకలం
ధాన్యాగారంగా పశ్చిమకు ఖ్యాతి
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 6 లక్షల ఎకరాల్లో సాగు
డెల్టా, మెట్టల్లోనూ 60 శాతానికిపైగా వరి పంట
ఖరీఫ్, రబీ కలిపి ఏటా 15 లక్షల టన్నులకు పైగా దిగుబడి
సోమవారం ఉంగుటూరు నియోజకవర్గం నల్లమాడులో పెన్షన్ పంపిణీ సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నీటి ఎద్దడి లేకుండా చేస్తానని మాట్లాడి.. వరి పంట వేస్తే కొనేవారే ఉండరు. రైతులందరూ గుర్తు పెట్టుకోవాలి. ఒక పంట తప్పదు కాబట్టి వరి వేద్దాం. మరో పంట మారుద్దాం..మెట్ట ప్రాంతాల్లో ఆదాయం వచ్చే పంటలు వేసుకోవాలన్న వ్యాఖ్యలు జిల్లాలో తీవ్ర చర్చకు దారితీసింది. వందేళ్ళకు పైబడి వరిసాగు జరిగే జిల్లాలో పంట మార్పుపై అది కూడా సీఎం వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
ఆందోళన ఆవరించే
ఆందోళన ఆవరించే


