ర్యాగింగ్ ఘటనలో 16 మంది సస్పెన్షన్
హైవేలో డీజిల్ దందా
అక్రమ డీజిల్ దందాకు కేరాఫ్ అడ్రస్‌గా కొయ్యలగూడెం మండలం అచ్యుతాపురం శివారు హైవే ప్రాంతం నిలయంగా మారింది. 2లో u
ఏలూరు టౌన్: ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ వివాదంపై ప్రిన్సిపల్ డాక్టర్ సావిత్రి సీరియస్ అయ్యారు. జూనియర్ వైద్య విద్యార్థుల ఫిర్యాదుపై తక్షణమే చర్యలు చేపట్టారు. 16 మంది సీనియర్ వైద్య విద్యార్థులను హాస్టల్ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ర్యాగింగ్ వ్యవహారంపై విచారణ కమిటీని నియమించినట్లు చెప్పారు. కమిటీ నివేదిక అనంతరం బాధ్యులపై చర్యలు తప్పవని తెలిపారు. ఇటీవల ఒక వైద్య విద్యార్థి అధిక మోతాదులో మందుబిళ్ళలు వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ విద్యార్థి సైతం ర్యాగింగ్‌తోనే ఒత్తిడికి గురైనట్లు చెబుతున్నారు. వీటన్నిపైనా సమగ్రమైన విచారణ చేస్తామని, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని ప్రిన్సిపల్ హెచ్చరించారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో దూరవిద్యా విధానంలో నిర్వహిస్తున్న 10వ తరగతి, ఇంటర్ కోర్సుల్లో ప్రవేశాలకు తత్కాల్‌లో ఫీజులు చెల్లించే అవకాశం అభ్యర్థులకు కల్పించినట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు.


