వైభవంగా ఉరుసు ఉత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా ఉరుసు ఉత్సవం

Dec 3 2025 7:37 AM | Updated on Dec 3 2025 7:37 AM

వైభవంగా ఉరుసు ఉత్సవం

వైభవంగా ఉరుసు ఉత్సవం

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరంలోని మెయిన్‌ బజార్‌ బిర్లాభవన సెంటర్‌లో ఉన్న (ఫకీర్‌ తకియా) ఖాదర్‌ జండా హజరత్‌ ఖాదర్‌వలీ గంజ్‌–ఏ–సవాయి మహాత్ముని 369వ ఉరుసు మహోత్సవం మంగళవారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించారు. సోమవారం ప్రారంభమైన ఈ ఉరుసు మహోత్సవాల్లో భాగంగా నిషాన ముబారక్‌ గోమ్‌ ఆవిష్కరణ, అనంతరం ఫాతెహా ఖానీ నిర్వహించారు. మంగళవారం సాయంత్రం ఖుర్‌ఆన్‌ ఖానీ అనంతరం దీపారాధన కార్యక్రమంతో ప్రధాన ఫాతెహా ఖానీ కార్యక్రమాన్ని ఏలూరు ప్రభుత్వ ఖాజీ షేక్‌ హుస్సేన్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్గా వంశపారంపర్య ముజావర్లు మహమ్మద్‌ అబ్దుల్‌ రహీమ్‌, మహమ్మద్‌ ఇబ్రాహీమ్‌, షేక్‌ మస్తాన్‌, సిరాజ్‌, కరీముల్లా, ఆలీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement