భీమవరం(ప్రకాశం చౌక్): స్థానిక గునుపూడిలో ఉన్న పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానంలో హుండీల ఆదాయాన్ని గురువారం అధికారులు లెక్కించారు. 40 రోజులకు గానూ ప్రధాన హుండీల ద్వారా రూ.27,03,849, అన్నదానం హుండీ ద్వారా రూ.1,27,617 ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. లెక్కింపు కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారులు ఏవీసత్యనారాయణరాజు, పీటీ గోవింద్, ఎంవీ రామరాజు, ఆలయ ప్రధాన అర్చకులు సోమేశ్వరరావు పాల్గొన్నారు.
ఏలూరు రూరల్: భీమవరానికి చెందిన క్రికెటర్ బి.మునీష్‌వర్మ ఆంధ్ర టి20 క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. కొద్దిరోజుల క్రితం విశాఖపట్టణం జిల్లాలో ఆంధ్ర క్రికెట్ ప్రిమియర్ లీగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పాస్ట్‌బౌలర్, బ్యాట్స్‌మెన్‌గా ప్రతిభ చాటని మునీష్‌వర్మను సెలక్టర్లు ఆంధ్ర జట్టుకు ఎంపిక చేసారు. దీంతో త్వరలో లక్నోలో జరగబోయే ఆల్ ఇండియా సయ్యద్ ముస్తాక్‌ఆలీ టి20 క్రికెట్ టోర్నమెంట్‌లో ఆంధ్రకు ప్రాతినిధ్యం వహించనున్నాడు.
సోమేశ్వరుని హుండీ ఆదాయం లెక్కింపు


