మూడు రోజులుగా అందని కోడిగుడ్డు
నూజివీడు: నూజివీడు ట్రిపుల్‌ఐటీ విద్యార్థులకు మూడు రోజులుగా కోడిగుడ్డు పెట్టడం లేదు. ఒకవైపు చికెన్ అరకొరగా పెడుతున్నారంటూ విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళన చేసిన సంగతి విదితమే. అయితే ఈనెల 24నుంచి కోడిగుడ్లూ కూడా పెట్టకుండా అర్ధంతరంగా నిలిపివేశారు. నెల రోజుల నుంచి విద్యార్థులకు కోడిగుడ్లు, చికెన్‌ను అందించే బాధ్యతను ఆర్జీయూకేటీ హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ తీసుకుంది. విద్యార్థులకు చికెన్, కోడిగుడ్లు సక్రమంగా అందించడం లేదనే విమర్శలు రావడంతో.. ఆ సంస్థ ఈ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు తెలిసింది. దీంతోనే విద్యార్థులకు మూడు రోజులుగా కోడిగుడ్లు అందడం లేదని సమాచారం. విద్యార్థులకు కోడిగుడ్లు అందించే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.
మంచి ఆహారం అందించేందుకు కృషి చేస్తున్నాం
విద్యార్థులకు మంచి ఆహారం అందించేందుకు కృషి చేస్తున్నామని నూజివీడు ట్రిపుల్‌ఐటీ ఏఓ బీ లక్ష్మణరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 24, 25 తేదీల్లో సాక్షి దినపత్రికలో ట్రిపుల్ ఐటీపై వచ్చిన కథనాలపై ఆయన వివరణ ఇచ్చారు. హెల్పింగ్‌హ్యాండ్స్‌లోని అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్న తరువాతే గవర్నింగ్ కౌన్సిల్ ఆ సంస్థకు మాంసాహారం అందించే బాధ్యతను ఇచ్చిందన్నారు. చికెన్ అయిపోయిందని భావించి ఈ4 విద్యార్థులు ఆందోళనకు దిగారే తప్ప చికెన్ సరిపోని కారణంగా కాదని పేర్కొన్నారు.
ఏలూరు రూరల్: ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని డిసెంబర్ 1, 2 తేదీల్లో గుంటూరులో దివ్యాంగుల రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు జరగనున్నాయని ఏలూరు జిల్లా డీఎస్‌డీఓ ఎస్‌ఏ అజీజ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్ల ఎంపిక పోటీలను ఈ నెల 28వ తేదీ ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో చేపట్టనున్నామని పేర్కొన్నారు. డబ్యుహెచ్1, డబ్యుహెచ్2 వీల్‌చైర్స్ వాడేవారు, ఎస్‌ఎల్3, ఎస్‌ఎల్4 లోయర్ లింబ్ ఇంపెయిర్‌మెంట్స్, ఎస్‌యు5 అప్పర్ లింబ్ ఇంపెయర్‌మెంట్స్ వారికి మాత్రమే పోటీలు జరుగుతాయని వెల్లడించారు. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో ఎంపికలు చేస్తామన్నారు. వివరాలకు 9984779015 నంబర్‌లో సంప్రదించాలన్నారు.


