ఎన్నికల హామీలు నిలబెట్టుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల హామీలు నిలబెట్టుకోవాలి

Mar 19 2025 12:11 AM | Updated on Mar 19 2025 12:10 AM

అమలాపురం టౌన్‌: ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు, పెన్షనర్లకు చంద్రబాబు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలని స్టేట్‌ గవర్నమెంట్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. జిల్లా పెన్షనర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధి ఎం.సాయి ప్రసాద్‌ అధ్యక్షతన స్థానిక ఏవీఆర్‌ నగర్‌లోని సంఘం భవనంలో మంగళవారం జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఇందులో జిల్లా అసోసియేషన్‌ పరిధిలోని 8 యూనిట్ల నేతలు పాల్గొని పెన్షనర్ల సమస్యలపై చర్చించారు. అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కేకేవీ నాయుడు ప్రవేశపెట్టిన పలు తీర్మానాలను సమావేశం ఆమోదించింది. తక్షణమే 12వ పే కమిషన్‌ ఏర్పాటు చేయాలని, ఉద్యోగులు, పెన్షనర్లకు వెంటనే 30 శాతం ఇంటీరియం రిలీఫ్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. పదో పీఆర్సీకి సమానంగా పెండింగ్‌లో ఉన్న అడిషనల్‌ క్వాంటం పునరుద్ధరించాలని కోరారు. 11వ పీఆర్‌సీలో ఒక నెల పెన్షన్‌ లేదా రూ.15 వేలు ఏది తక్కువైతే అది అనే దానికి బదులుగా రూ.25 వేలకు తగ్గించిన ఫ్యూనరల్‌ చార్జీలు పునరుద్ధరించాలని, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ను రూ.5 లక్షలకు పెంచాలని, పెండింగ్‌ డీఏలు తక్షణమే విడుదల చేయాలని కోరింది. రిటైరైన ఉద్యోగులకు తక్షణమే బెనిఫిట్స్‌ చెల్లించాలని, వెరిఫికేషన్‌ సర్టిఫికెట్ల సబ్‌మిషన్‌ గడువును ఏప్రిల్‌ 20 వరకూ పొడిగించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో జిల్లా పెన్షనర్ల అసోసియేషన్‌ ప్రతినిధులు వై.సత్తిరాజు, ఏవీవీ సత్యనారాయణ, మండలీక ఆదినారాయణ, జి.నరసింహరావు, వైఎస్‌ జగన్మోహనరావు, టీవీ శర్మ తదితరులు పాల్గొన్నారు.

·˘ 12Ð]l õ³ MýSÑ$çÙ¯ŒS¯]l$ °Ä¶æ$Ñ$…^éÍ

·˘ IBÆŠ‡ {ç³MýSsìæ…^éÍ

·˘ ò³¯]lÛ¯]lÆŠ‡Þ AÝùíÜÄôæ$çÙ¯ŒS yìlÐ]l*…yŠæ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement