ప్రభుత్వం మా కుటుంబానికి 2.50 ఎకరాల్లో ఇచ్చిన పట్టా భూమిని అప్పగించాలని కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో 30 సార్లు ఫిర్యాదు చేశాను. ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. 1973 నుంచి 2017 వరకూ భూమి మా అధీనంలో ఉంది. పంట బోదె అని అధికారులు తప్పుడు రికార్డులు సృష్టించారు. తహసీల్దార్, వీఆర్‌ఓలు భూమిని స్వాధీనం చేసుకున్నారు. స్థానిక అధికారులు వేలాది రూపాయల ఫలసాయాన్ని అనుభవిస్తున్నారు. సమస్య పరిష్కరించాలని అర్జీ సమర్పించాను.
– కుంచే రాజేంద్ర ప్రసాద్, కుంచే వెంకన్నబాబు,
జి.వేమవరం, ఐ.పోలవరం మండలం
కూటమి పార్టీ వారు
చంపుతామని బెదిరిస్తున్నారు
అల్లవరం మండలం గోడిలంక గ్రామం రాజుగారి వీధిలో పంచాయతీ సిమెంటు రోడ్డును మూడు నెలలు క్రితం సర్పంచ్‌తో పాటు పలువురు కూటమి నాయకులు ధ్వంసం చేశారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాను. దీంతో నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు. రోడ్డు తవ్విన వారితో పాటు కొంత మంది అర్ధరాత్రి సమయాల్లో నా ఇంటికి వచ్చి, తలుపులు కొట్టి, ఫిర్యాదులు ఉపసంహరించుకోవాలని, లేకుంటే చంపుతామని బెదిరిస్తున్నారు. నాకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీనిపై కలెక్టర్‌కు అర్జీ ఇచ్చాను.
– రుద్రరాజు వెంకటరాజు (తాతాలు రాజు),
రైతు, గోడిలంక, అల్లవరం మండలం
ఇసుక దోపిడీకి అడ్డుకట్ట వేయాలి
కపిలేశ్వరపురం, ఆలమూరు, కొత్తపేట మండలాల పరిధిలోని కేదార్లంక, వాడపాలెం, తాతపూడి, కొత్తపేట ఇసుక ర్యాంపుల్లో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. దీనివల్ల లంక భూములు కోతకు గురవుతున్నాయి. మైన్స్ అధికారులు వారి తాయిలాల కోసం ఇష్టానుసారం ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే అనుమతులు ఇచ్చేస్తున్నారు. దీనిపై మైన్స్, భూగర్భ జల, రెవెన్యూ, జలవనరుల శాఖలు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులతో జాయింట్ ఇన్‌స్పెక్షన్ కమిటీ వేసి, పరిస్థితులు బట్టి అనుమతులివ్వాలి. ఈ మేరకు వినతిపత్రం ఇచ్చాను.
– పెదపూడి బాపిరాజు,
రైతు, వాడపాలెం, కొత్తపేట మండలం.
30 సార్లు ఫిర్యాదు చేసినా..
30 సార్లు ఫిర్యాదు చేసినా..