హోలీ వేడుకలపై ప్రత్యేక నిఘా | - | Sakshi
Sakshi News home page

హోలీ వేడుకలపై ప్రత్యేక నిఘా

Mar 14 2025 12:32 AM | Updated on Mar 14 2025 12:33 AM

ఇతరులకు ఇబ్బంది కలిగించ వద్దు

రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో

రంగులు జల్లవద్దు

జిల్లా ఎస్పీ కృష్ణారావు

అమలాపురం టౌన్‌: జిల్లా కంట్రోల్‌ రూమ్‌ నుంచి సీసీ టీవీల ద్వారా హోలీ వేడుకలపై ప్రత్యేక నిఘా పెట్టామని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు తెలిపారు. హోలీ వేడుకలను జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఇదే సమయంలో ఇతరులకు ఇబ్బంది కలిగేలా లేదా రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో ఇతరులపై రంగులు జల్లడం వంటి చర్యలకు పాల్పడవద్దని హితవు పలికారు. ఈ మేరకు ఎస్పీ కార్యాలయం నుంచి గురువారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. హోలీ పేరుతో హానికర రసాయనాలతో కూడిన రంగులను వాడరాదని చెప్పారు. గీత దాటిన వారిపై జిల్లా పోలీస్‌ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు. హోలీ సందర్భంగా ఎక్కడా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు స్పష్టం చేశారు. ఆకతాయిలను గుర్తించేందుకు డ్రోన్లను ఉపయోగిస్తున్నట్టు తెలిపారు. ప్రత్యేక మొబైల్‌ పార్టీలు గస్తీ తిరుగుతున్నాయని, ముఖ్య ప్రదేశాల్లో పోలీస్‌ పికెట్లు ఏర్పాటు చేసినట్టు వివరించారు. హోలీ రంగుల వల్ల జిల్లాలో ఎవరైనా ఇబ్బంది పడితే డయల్‌–112కి కాల్‌ చేయాలని లేదా సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement