
చెన్నై : భర్త అనుమానం భరించలేక ఇద్దరు పిల్లలతో కలిసి భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన తెన్‌కాశి జిల్లాలో మంగళవారం జరిగింది. చెక్కడియూర్‌కు చెందిన తంగయ్య కుమారుడు సురేష్ (35) కూలీ. తెన్‌కాశి మంగమ్మాళ్ రోడ్డుకు చెందిన మోహన్‌రాజ్ కుమార్తె గౌరి కనక (30)తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. సురేష్ చెన్నైలో పనిచేస్తున్నాడు. వీరికి కుమారుడు కీర్తన్ (5), కుమార్తె ఇలక్కియా (3) ఉన్నారు. ఇలావుండగా సురేష్ భార్య గౌరిపై అనుమానంతో తర చూ గొడవపడేవాడు. మంగళవారం మరోసారి భార్య పై అనుమానం వ్యక్తం చేశా డు. తీవ్ర మనస్తాపానికి గురైన గౌరి తనతో పాటు ఇద్దరి పిల్లలపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టుకుని ఆత్మహత్య చేసుకుంది.