
ప్రతీకాత్మక చిత్రం
వలర్మతికి పక్కింటికి చెందిన వేల్‌రాజ్ (20)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరిద్దరూ గత మూడో తేదీన ఇంటి నుంచి పరారై తిరుచ్చి ధారానల్లూరు ప్రాంతంలో సహజీవనం సాగిస్తున్నారు. విషయం తెలిసి సత్యేంద్రన్,
టీ.నగర్: వివాహేతర జంట దారుణ హత్యకు గురైంది. రామనాథపురం జిల్లా, నయినార్‌కోవిల్ సమీపం మనిచ్చియేందల్‌కు చెందిన సత్యేంద్రన్ (28). ఇతనికి శివగంగై జిల్లా, మానామదురైకి చెందిన వలర్మతి (22)కి ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. సత్యేంద్రన్ తిరుచ్చిలోని దుకాణంలో పనిచేస్తూ వచ్చాడు. వలర్మతికి పక్కింటికి చెందిన వేల్‌రాజ్ (20)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరిద్దరూ గత మూడో తేదీన ఇంటి నుంచి పరారై తిరుచ్చి ధారానల్లూరు ప్రాంతంలో సహజీవనం సాగిస్తున్నారు. విషయం తెలిసి సత్యేంద్రన్, తమ్ముడు ప్రభు, స్నేహితులతో కలిసి వలర్మతి, వేల్‌రాజ్‌పై దాడి చేశారు. దాడిలో వేల్‌రాజ్, వలర్మతి మృతిచెందారు. సత్యేంద్రన్ పోలీసులకు లొంగిపోయాడు.
కుటుంబకలహాలతో వివాహిత ఆత్మహత్య
తిరువొత్తియూరు: కుటుంబకలహాలతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ గటన మాధవరంలో చోటుచేసుకుంది. మాధవరానికి చెందిన మోహన్ కట్టడ కూలీ. ఇతని భార్య ఈశ్వరి (25). వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. మోహన్ తరచూ మద్యానికి బానిసవడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో సోమవారం రాత్రి దంపతుల మధ్య గొడవ చోటుచేసుకుంది. విరక్తి చెందిన ఈశ్వరి గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మాధవరం పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్టాన్లీ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భర్త మోహన్ వద్ద విచారణ జరుపుతున్నారు.