
ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా.. దేశీయ మార్కెట్లో కొత్త 'క్యామ్రీ స్ప్రింట్ ఎడిషన్'ను రూ. 48.50 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ స్పెషల్ ఎడిషన్ స్పెషల్ యాక్సెసరీ కిట్‌తో లభిస్తుంది. కాబట్టి ఇది స్టాండర్డ్ మోడల్ కంటే కూడా చాలా కొత్తగా కనిపిస్తుంది.
టయోటా క్యామ్రీ స్ప్రింట్ ఎడిషన్.. ఎమోషనల్ రెడ్, ప్లాటినం వైట్ పెర్ల్, సిమెంట్ గ్రే, ప్రెషియస్ మెటల్ & డార్క్ బ్లూ మెటాలిక్ అనే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అయితే బానెట్, రూప్ వంటివి మ్యాట్ బ్లాక్ కలర్ పొందుతాయి. ఈ కారులోని 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ బ్లాక్-అవుట్ ఫినిషింగ్‌ను పొందుతాయి.
క్యామ్రీ స్ప్రింట్ ఎడిషన్.. లోపలి భాగంలో యాంబియంట్ లైటింగ్, పుడిల్ లాంప్స్ వంటివి పొందుతుంది.12 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, పవర్డ్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జర్, 3 జోన్ క్లైమేట్ కంట్రోల్, హెడ్స్ అప్ డిస్ప్లే వంటి వాటితో పాటు 9 స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్ వంటివన్నీ కూడా ఈ స్పెషల్ ఎడిషన్లో ఉన్నాయి.
ఇదీ చదవండి: కొరియా బ్రాండ్ కారుకు డిమాండ్!.. నాలుగు నెలల్లో 21000 బుకింగ్స్
టయోటా లాంచ్ చేసిన క్యామ్రీ స్ప్రింట్ ఎడిషన్ డిజైన్ పరంగా అప్డేట్ పొందినప్పటికీ.. యాంత్రికంగా ఎలాంటి మార్పులు పొందలేదు. కాబట్టి ఇందులో సాధారణ క్యామ్రీలోని 2.5 లీటర్ నాలుగు సిలిండర్స్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 187 హార్స్ పవర్, 221 న్యూటన్ మీటర్ టార్క్, ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 7.2 సెకన్లలోనే 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇది లీటరుకు 25.4 కిమీ మైలేజ్ అందిస్తుంది. దీంతో ఈ కారు భారతదేశంలో అమ్మకానికి ఉన్న అత్యధిక మైలేజ్ కార్ల జాబితాలో ఒకటిగా మారింది.