క్రెడిట్‌, డెబిట్‌ కార్డు యూజర్లకు అలర్ట్‌..! వచ్చే ఏడాది నుంచి మారనున్న రూల్స్‌..!

New Credit Debit Card Rules For Online Payments From Next Month - Sakshi

క్రెడిట్‌, డెబిట్‌ కార్డు యూజర్లకు అలర్ట్‌..! అన్ని డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల లావాదేవీల విషయంలో వచ్చే ఏడాది నుంచి కొత్త రూల్స్‌ను రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా అందుబాటులోకి తీసుకురానుంది. డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా జరిపే లావాదేవీలను మరింత సురక్షితంగా మార్చాలనే లక్ష్యంతో ఆర్బీఐ కొత్త రూల్స్‌ను తీసుకురానుంది. 

ఇకపై అన్ని వివరాలను గుర్తుంచుకోవాలి...!
క్రెడిట్‌, డెబిట్‌ కార్డులను ఉపయోగించి జరిపే ఆన్‌లైన్‌ లావాదేవీలకు ఆర్బీఐ కీలక ఆదేశాలను జారీ చేసింది. ఆయా వెబ్‌సైట్లు, పేమెంట్ గేట్‌వేస్‌లలో అంతకుముందే  నిక్షిప్తమైన క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వివరాలు ఇకపై నిక్షిప్తం కావు. ఆర్బీఐ కొత్త రూల్స్ ప్రకారం.. ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు లేదంటే డిజిటల్ చెల్లింపులు నిర్వహించేటప్పుడు ఆ‍యా వెబ్‌సైట్స్, యాప్స్ వంటివి కస్టమర్ల క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వివరాలను స్టోర్ చేయకూడదని ఆర్బీఐ పేర్కొంది. ఈ కొత్త రూల్స్ జనవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి. దీంతో కొత్త ఏడాది నుంచి ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు కచ్చితంగా 16 అంకెల డెబిట్‌, క్రెడిట్‌ కార్డు నంబర్లతో పాటు, సీవీవీ, గడువు తేదీ వంటి వివరాలను గుర్తుంచుకోవాలి.  ఒక వేళ ఇది వీలు కాకుంటే...టోకెనైజేషన్ పద్ధతిని వాడాల్సి ఉంటుంది. ఆర్బీఐ 2020 మార్చి నెలలోనే ఈ విషయాన్ని వెల్లడించింది. డేటా సెక్యూరిటీ నిబంధనల ప్రకారం.. వెబ్‌సైట్స్, యాప్స్ కస్టమర్ల కార్డుల వివరాలను స్టోర్ చేయకూడదని ఆదేశించింది. 
చదవండి: ఎస్బీఐ బంపర్‌ ఆఫర్‌..! కార్డు తీసుకుంటే రూ.4,999 విలువైన స్మార్ట్‌వాచ్‌ ఉచితం..! ఇంకా మరెన్నో ఆఫర్లు

అలర్ట్ ఐనా బ్యాంకులు..!
వచ్చే ఏడాది నుంచి మారనున్న క్రెడిట్‌, డెబిట్‌ కార్డు రూల్స్‌ మారడంతో ఆయా బ్యాంకులు తమ ఖాతాదారులను ఇప్పటికే అలర్ట్‌​ చేస్తున్నట్లు తెలుస్తోంది. మర్చంట్ వెబ్‌సైట్ లేదా యాప్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డు వివరాలు స్టోర్ చేయడం కుదరదని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఇప్పటికే తమ ఖాతాదారులకు తెలియజేస్తోంది. 

టోకెనైజేషన్‌ అంటే..?
ఆన్‌లైన్‌ లావాదేవీలను జరిపేటప్పుడు ఖాతాదారులు 16 అంకెల క్రెడిట్‌, డెబిట్‌ కార్డు వివరాలను గుర్తుంచుకోకపోతే...టోకెనైజేషన్ విధానాన్ని వాడవచ్చును. ఈ విధానంలో ఆయా క్రెడిట్‌, డెబిట్‌ కార్డు యూజర్లు వారి కార్డు వివరాలను తెలియజేయాల్సిన పని లేదు. ఒరిజినల్ కార్డు నెంబర్‌కు బదులు ప్రత్యామ్నాయ ఎన్‌క్రిప్టెడ్‌ కోడ్‌ను బ్యాంకులు ఇస్తాయి. దీన్ని టోకెన్ అని పిలుస్తారు. లావాదేవీ సమయంలో ఈ కోడ్‌ను అందిస్తే సరిపోతుంది. 
చదవండి: మార్కెట్‌క్రాష్‌.. సోషల్‌ మీడియాలో నవ్వులు పూయిస్తున్న మీమ్స్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top