ట్రంప్‌ టారిఫ్‌లు.. మన ఎగుమతులకు మంచిదే | Indian exports to US to become tighter amid tariff hike | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ టారిఫ్‌లు.. మన ఎగుమతులకు మంచిదే

Jul 15 2025 4:48 AM | Updated on Jul 15 2025 9:52 AM

Indian exports to US to become tighter amid tariff hike

భారత్‌ కంటే చైనా, కెనడా, మెక్సికోపైనే అధిక ప్రభావం 

నీతి ఆయోగ్‌ నివేదిక వెల్లడి 

న్యూఢిల్లీ: అమెరికా మార్కెట్లో భారత ఎగుమతులు మరింత పోటీతత్వంగా మారినట్టు నీతి ఆయోగ్‌ నివేదిక వెల్లడించింది. చైనా, కెనడా, మెక్సికోలపై ట్రంప్‌ సర్కారు అధిక టారిఫ్‌లు విధించడం మనకు అనుకూలిస్తుందని పేర్కొంది. సంఖ్యా పరంగా, విలువ పరంగా అమెరికా మార్కెట్లో భారత ఎగుమతులకు గణనీయమైన అవకాశాలున్నట్టు తెలిపింది. ‘‘30కు గాను 22 విభాగాల్లో భారత పోటీతత్వం పెరగనుంది. 

ఈ విభాగాల మార్కెట్‌ పరిమాణం 2,285 బిలియన్‌ డాలర్లుగా ఉంది’’అని ఈ నివేదిక వెల్లడించింది. ఈ విభాగాల్లో అమెరికాకు చైనా, కెనడా, మెక్సికో ప్రధాన ఎగుమతిదారులుగా ఉన్నట్టు తెలిపింది. ఈ దేశాలపై 30 శాతం, 35 శాతం, 25 శాతం చొప్పున అధిక సుంకాల బాదుడుతో భారత ఎగుమతుల పోటీతత్వం పెరగనున్నట్టు అంచనా వేసింది. ఫార్మాస్యూటికల్స్, టెక్స్‌టైల్స్, ఎలక్ట్రికల్‌ మెషినరీ తదితర విభాగాల్లో మార్కెట్‌ వాటా పెంచుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది.

 ఇక 30కు గాను 6 విభాగాల్లో భారత పోటీతత్వంలో ఎలాంటి మార్పు ఉండబోదని నీతి ఆయోగ్‌ నివేదిక వెల్లడించింది. భారత్‌ నుంచి అమెరికాకు ఎగుమతుల్లో వీటి వాటా 32.8 శాతంగా (26.5 బిలియన్‌ డాలర్లు) ఉంటుందని తెలిపింది. ‘‘ఆరు ఉత్పత్తుల విభాగాల్లో భారత్‌ 1–3 శాతం మేర అధిక టారిఫ్‌లను ఎదుర్కోనుంది. యూఎస్‌కు భారత ఎగుమతుల్లో 52 శాతం వాటా కలిగిన 78 ఉత్పత్తుల విభాగాల్లో పోటీతత్వం పెరగనుంది. 17 ఉత్పత్తుల విభాగాల్లో ఎలాంటి మార్పు ఉండదు’’అని వివరించింది.  

ఈ రంగాలకు సానుకూలం.. 
చైనా, కెనడా, మెక్సికోలపై టారిఫ్‌లతో పోల్చి చూస్తే.. భారత మినరల్స్, ఇంధనాలు, వ్రస్తాలు, ఎల్రక్టానిక్స్, ప్లాస్టిక్స్, ఫరి్నచర్, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులకు ప్రయోజనం చేకూరనున్నట్టు నీతి ఆయోగ్‌ తన నివేదికలో విశ్లేషించింది. ఎంఎస్‌ఎంఈలకు మద్దతుగా నిలిచేందుకు, ఎగుమతుల పోటీతత్వాన్ని పెంచేందుకు వీలుగా ఉత్పత్తి అనుసంధాన ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని (పీఎల్‌ఐ) విస్తరించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించింది. 

లెదర్, ఫుట్‌వేర్, ఫరి్నచర్, హ్యాండిక్రాఫ్ట్స్‌కు సైతం పీఎల్‌ఐ కింద మద్దతు ఇవ్వాలని పేర్కొంది. అలాగే, విద్యుత్‌ టారిఫ్‌లను తగ్గించడం, పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించింది. దీనివల్ల తయారీ వ్యయాలు తగ్గుతాయని వివరించింది. ఐటీ, ఆర్థిక సేవలు, నైపుణ్య సేవలు, విద్యా రంగాలను దృష్టిలో పెట్టుకుని అమెరికాతో సేవల ఆధారిత వాణిజ్య ఒప్పందానికి కృషి చేయాలని సూచించింది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement