Good News For Freshers, 45,000 Artificial Intelligence Jobs in India - Sakshi
Sakshi News home page

భారత్‌లో ఈ టెక్నాలజీకి ఫుల్ డిమాండ్.. ప్రారంభ శాలరీ రూ.14లక్షలు!

Mar 21 2023 4:19 PM | Updated on Mar 21 2023 4:58 PM

45,000 Artificial Intelligence Jobs In India With Up To Rs 14 Lakh Starting Salary - Sakshi

ష్ణాతులైన ఫ్రెషర్స్‌కు ప్రారంభ వేతనం సంవత్సరానికి రూ.10 లక్షల నుంచి రూ.14 లక్షలు ఇచ్చేందుకు సంస్థలు మొగ్గుచూపుతున్నాయని హైలెట్‌ చేసింది

శాస్త్ర, సాంకేతికతల సహాయంతో ప్రపంచాన్నే గుప్పిట్లోకి తెచ్చిన శాస్త్రవేత్తలు..ఇప్పుడు మానవ మేధస్సుకే సవాల్ విసురుతున్నారు. సృష్టికి ప్రతిసృష్టి చేస్తూ కృత్రిమ మేధస్సు (Artificial Intelligence)కు ప్రాణం పోస్తున్నారు. అలా వెలుగులోకి వచ్చిన చాట్‌జీపీటీ, డాల్‌-ఈ, బింగ్‌ ఏఐ, మిడ్‌ జర్నీ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సర్వీసులు చాప కింద నీరులా అన్నీ రంగాల్లోకి ప్రవేశిస్తున్నాయి.

వెరసి లేఆఫ్స్‌ వేళ ఒక్క భారత్‌లో వేలల్లో ఉద్యోగాలు ఉండగా..లక్షల్లో జీతాలు ఇచ్చేందుకు సంస్థలు పోటీపడుతున్నాయి. ఇటీవల ప్రముఖ ఆన్‌లైన్‌ జాబ్‌ పోర్టల్‌ టీమ్‌లీజ్‌ డిజిటల్‌ ఓ నివేదికను విడుదల చేసింది. ఆ రిపోర్ట్‌ ప్రకారం..హెల్త్‌ కేర్‌, ఎడ్యుకేషన్‌, బ్యాంకింగ్‌, మ్యానిఫ్యాక్చరింగ్‌, రీటైల్‌ విభాగాల్లో 45 వేల ఉద్యోగాలు ఉన్నాయని తెలిపింది. ఏఐలో నిష్ణాతులైన ఫ్రెషర్స్‌కు ప్రారంభ వేతనం సంవత్సరానికి రూ.10 లక్షల నుంచి రూ.14 లక్షలు ఇచ్చేందుకు సంస్థలు మొగ్గుచూపుతున్నాయని హైలెట్‌ చేసింది. 

ఎక్కువగా కోరుకునే రంగాలు 
ఏఐలో డేటా సైంటిస్ట్‌, ఎంఎల్‌ (Machine Learning) ఇంజినీర్లుగా పనిచేసేందుకు మక్కువ చూపుతున్నారని నివేదిక పేర్కొంది. ఈ లేటెస్ట్‌ టెక్నాలజీలో రాణించేందుకు వృత్తికి అవసరమైన నైపుణ్యాల (skills) ప్రాముఖ్యతను వివరించింది. గ్లోబల్‌ మార్కెట్‌లో సమయం, డబ్బు ఆదా చేస్తూ మిలియన్ల మంది వినియోగదారుల అవసరాలను తీర్చేలా ఉపయోగకరంగా ఉంది. తద్వారా కంప్యూటర్ ప్రోగ్రామర్లు వేగవంతమైన మార్గాల్లో డేటాను ఎలా ప్రాసెస్ చేయాలో కూడా కంప్యూటర్‌లకు చెప్పే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ నిపుణుల డిమాండ్‌తో పాటు ఆర్టీఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీ రాణించేందుకు మెషిన్‌ లెర్నింగ్‌లు కెరీర్‌కు అవసరమైన స్కిల్స్‌ అని తెలిపింది.  

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై మక్కువ
టీమ్‌లీజ్‌ చేసిన సర్వేలో 37 శాతం సంస్థలు ఏఐ టూల్స్‌పై తర్ఫీదు ఇస్తున్నాయి. ఆ విభాగంలో అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. 30 శాతం కంపెనీలు ఉద్యోగుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసి వారికి ఆర్టీఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగంలో అడుగు పెట్టేలా ప్రోత్సహిస్తున్నాయి. 

భారత్‌లో వారికి ఫుల్ డిమాండ్
ఇక, భారత్‌లో ప్రస్తుతం ఫ్రెషర్లగా విధులు నిర్వహించే ఇంజినీర్లకు ఏడాదికి రూ.14 లక్షల వరకు, ఎంఎల్‌ ఇంజినీర్లకు రూ.10 లక్షలు, డేటా సైంటిస్ట్‌లకు రూ.14 లక్షలు, డెవాప్స్‌ ఇంజినీర్లకు రూ.12 లక్షలు, డేటా ఆర్కిటెక్చర్‌కు రూ.12 లక్షలు, బీఐ అనాలసిస్‌కు రూ.14 లక్షలు, డేటాబేస్‌ అడ్మిన్‌కు రూ.12 లక్షల వరకు జీతాలు ఇస్తున్నట్లు టీమ్‌ లీజ్‌ నివేదిక వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement