22 కోట్ల ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్‌న్యూస్..!

22.55 Crore Accounts Have Been Credited With Interest of 8.50 Per Cent for the FY 2020-21 - Sakshi

22.55 కోట్ల మంది ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ అదిరిపోయే శుభవార్త చెప్పింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 8.50 శాతం వడ్డీని పీఎఫ్ ఖాతాలో జమ చేసినట్లు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) తెలిపింది. ఈ మేరకు ఈపీఎఫ్‌ఓ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా పేర్కొంది. ఈపీఎఫ్ఓ ప్రస్తుతం పీఎఫ్‌ పెట్టుబడులపై 8.5 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. ఈపీఎఫ్ఓ ​​2020-21 సంవత్సరానికి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సభ్యుల ఖాతాలకు వడ్డీ రేటును అక్టోబర్ 30వ తేదీన ఇచ్చిన సర్క్యులర్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. 

ఈ ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్ల కంటే ఎక్కువ విత్ డ్రా ఉన్నందున 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటును రిటైర్ మెంట్ ఫండ్ రెగ్యులేటరీ బాడీ మార్చకుండా ఉంచింది. దేశంలో కరోనావైరస్ వ్యాప్తి తర్వాత ఈపీఎఫ్ఓ మార్చిలో 2019-20 సంవత్సరానికి వడ్డీ రేటును ఏడు సంవత్సరాల కనిష్టస్థాయికి(8.5 శాతం) తగ్గించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీరేటు 8.65 శాతంగా ఉంది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.55 శాతం కాగా, 2016-17 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ ఖాతాదారులకు ఇచ్చిన ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.65 శాతంగా ఉంది.

ఆన్‌లైన్‌లో పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి ఇలా..

  • ఈపీఎఫ్ పోర్టల్ https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login లింకు మీద క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీ ఖాతా ఓపెన్ చేయడానికి మీ యుఎఎన్ నెంబర్, పాస్ వర్డ్ నమోదు చేయండి.
  • సైన్ ఇన్ చేసిన తర్వాత మీరు మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.

ఈపీఎఫ్ ఖాతాదారులు ఒక్క మెస్సేజ్ ద్వారా ఖాతాదారులకు పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. మీ మొబైల్ ద్వారా EPFOHO UAN ENG అని టైప్ చేసి 7738299899కు మీ రిజిస్టర్డ్ మొబైల్ నుంచి మెస్సేజ్ చేయాలి. పీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్, చివరి ఇన్‌స్టాల్ మెంట్ వివరాలు అందుతాయి. ఈపీఎఫ్ ఖాతాలో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ నుంచి 011-22901406  నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top