
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి బ.ఏకాదశి ప.1.04 వరకు, తదుపరి ద్వాదశి నక్షత్రం రేవతి రా.2.30 వరకు, తదుపరి అశ్విని, వర్జ్యం ప.2.17 నుండి 3.55 వరకు, దుర్ముహూర్తం ఉ.9.46 నుండి 10.37 వరకు తదుపరి ప.2.56 నుండి 3.47 వరకు అమృతఘడియలు... రా.12.02 నుండి 1.40 వరకు.
సూర్యోదయం : 5.29
సూర్యాస్తమయం : 6.24
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుంచి 7.30 వరకు
మేషం: ఆదాయం కంటే ఖర్చులు అధికం. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలు. భూవివాదాలు. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాల్లో ఒడిదుడుకులు
వృషభం: ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. కాంట్రాక్టులు లభిస్తాయి. ఉద్యోగాల్లో ఉన్నత స్థితి. వ్యాపారాల్లో నూతనోత్సాహం.
మిథునం: సమాజంలో గౌరవం పెరుగుతుంది. కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది. నూతన పరిచయాలు. రాబడి కొంత పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాల్లో ఒత్తిడులు అధిగమిస్తారు.
కర్కాటకం: రాబడి నిరాశ కలిగిస్తుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్య సూచనలు. వ్యాపార, ఉద్యోగాల్లో పొరపాట్లు. దూరప్రయాణాలు.
సింహం: కుటుంబ సమస్యలు ఎదురుకావొచ్చు. పనుల్లో ఆటంకాలు. బంధువులు మిత్రుల నుంచి ఒత్తిళ్లు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపార, ఉద్యోగాల్లో చిక్కులు.
కన్య: బంధువులను కలుస్తారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. ఆస్తి లాభం. యత్నకార్యస్దిధి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాల్లో ఉన్నత స్థితి.
తుల: ఆదాయం పెరిగి రుణాలు తీరుస్తారు. బంధువుల చేయూతతో వ్యవహారాలు పూర్తి చేస్తారు. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. స్పల్ప అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాల్లో అనుకూల మార్పులు.
వృశ్చికం: కొన్ని కార్యక్రమాల్లో అవాంతరాలు. ఆదాయం అంతగా కనిపించదు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో వివాదాలు. వ్యాపార, ఉద్యోగాల్లో నిరుత్సాహం.
ధనస్సు: అప్పులు చేస్తారు. దూర ప్రయాణాలు. సోదరులతో వివాదాలు. కుటుంబంలో కొన్ని సమస్యలు. ఆరోగ్యం ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాపార, ఉద్యోగాల్లో నిరుత్సాహం.
మకరం: ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన పనుల్లో విజయం. ఆలయాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగినవారి పరిచయాలు. వ్యాపార, ఉద్యోగాలు ప్రగతిదాయకంగా ఉంటాయి.
కుంభం: ప్రయాణాల్లో అవరోధాలు. పనులు ముందుకు సాగవు. బంధువులతో తగాదాలు. వ్యాపారాల్లో సమస్యలు. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు.
మీనం: కార్యసిద్ధి. మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. ప్రత్యర్థుల సహకారం సైతం అందుతుంది. దైవదర్శనాలు. శుభకార్యాల నిర్వహణ. వ్యాపార, ఉద్యోగాల్లో ప్రోత్సాహం.