Today Horoscope: ఈ రాశివారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు

Today Horoscope 22-12-2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి: బ.చతుర్దశి సా.6.24 వరకు, తదుపరి అమావాస్య, నక్షత్రం: జ్యేష్ఠ తె.4.32 వరకు (తెల్లవారితే శుక్రవారం), తదుపరి మూల, వర్జ్యం: ఉ.10.52 నుండి 12.23 వరకు, దుర్ముహూర్తం: ఉ.10.10 నుండి 10.52 వరకు, తదుపరి ప.2.31 నుండి 3.14 వరకు, అమృతఘడియలు: రా.8.58 నుండి 9.36 వరకు;

రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు,
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు;
సూర్యోదయం 6.29;
సూర్యాస్తమయం 5.26. 

మేషం: పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. ఆస్తి వివాదాలు. ఉద్యోగ, వ్యాపారాలలో చికాకులు. వాహనాలు, గృహం కొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. 

వృషభం: చేపట్టిన పనులలో పురోగతి. సంఘంలో గౌరవమర్యాదలు. ఆధ్యాత్మిక చింతన. ముఖ్య నిర్ణయాలు. నూతన  కాంట్రాక్టులు లభిస్తాయి. ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలత. 

మిథునం: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహార విజయం. శుభవార్తలు. నూతన ఉద్యోగయోగం. ఉద్యోగ, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. 

కర్కాటకం: రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన. ఉద్యోగ, వ్యాపారాలలో ఒత్తిడులు తప్పకపోవచ్చు.

సింహం: ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. మిత్రులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. ఉద్యోగ, వ్యాపారాలలో మార్పులు. 

కన్య: ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఉద్యోగ,వ్యాపారాలలో పురోగతి. 

తుల: విద్య, ఉద్యోగ.ప్రయత్నాలు మందగిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది.  బంధువులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. ఉద్యోగ, వ్యాపారాలు అంతగా అనుకూలించవు.

వృశ్చికం: శ్రమ ఫలిస్తుంది. నూతన విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన. ఉద్యోగ, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. 

ధనుస్సు: పనుల్లో కొంత జాప్యం. ఆర్థికంగా ఇబ్బందులు. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఉద్యోగ, వ్యాపారాలలో ఒత్తిడులు. ఆస్తుల వ్యవహారాలు చికాకు పరుస్తాయి. దైవదర్శనాలు. 

మకరం: నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన,వస్తులాభాలు. ఉద్యోగ, వ్యాపారాలలో సమస్యలు తీరతాయి.

కుంభం: కొత్త విషయాలు తెలుస్తాయి. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగ, వ్యాపారాలలో మరింత అభివృద్ధి కనిపిస్తుంది. 

మీనం: సన్నిహితులతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. పనుల్లో స్వల్ప ఆటంకాలు. విద్యార్థులకు నిరుత్సాహం. ఉద్యోగ,వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top